Kerala : ఆలయంలోకి వెళ్లిన దళితులు..అస్పృశ్య‌త‌, వివ‌క్ష‌ల‌కు ముగింపు

స్వర్గ సమీపంలోని ఎన్మకజెకలోని ఆలయంలోనికి దళితులు అడుగుపెట్టారు. పట్టికజాతి క్షేమ సమితి (పీకేస్) ఆధ్వర్యంలో దళితుల బృందం ఆలయంలోనికి ప్రవేశించింది.

Dalits Enter Kerala Temple : దళితులు..వీరి పట్ల కొంతమంది వివక్ష చూపుతుంటారు. వీరిని కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. ఇప్పటికీ వారిపై దాడులు, సంఘ బహిష్కరణలు జరుగుతుంటాయి. ఆలయాల్లోకి వీరిని రానివ్వరు. దీంతో దేవుడిని దర్శనం చేసుకోలేక మనోవేదనకు గురవుతుంటారు. కొన్ని రాష్ట్రాలో ఆలయాల్లో దళితులకు ప్రవేశం కల్పిస్తున్నారు..కేరళ రాష్ట్రం దళితుల పట్ల..పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆలయాల్లో వారిని పూజారులగా నియమించడం, ఆలయాల్లో ప్రవేశం కల్పిస్తూ..నిర్ణయాలు తీసుకొంటోంది.

Read More : Tennis Star Peng : మాజీ ప్రధాని లైంగికంగా వేధించాడు..టెన్నిస్ స్టార్ పెంగ్ భద్రతపై ఆందోళన

తరాల తరబడి సాగుతున్న అంతరాలు, వివక్షకు తెరదించుతోంది. తాజాగా…కేరళలోని స్వర్గ సమీపంలోని ఎన్మకజెకలోని ఆలయంలోనికి దళితులు అడుగుపెట్టారు. పట్టికజాతి క్షేమ సమితి (పీకేస్) ఆధ్వర్యంలో దళితుల బృందం ఆలయంలోనికి ప్రవేశించింది. అగ్రవర్ణాలకు కేటాయించిన..పవిత్రంగ భావించే 18 మెట్లను సైతం ఎక్కారు. తరాల నుంచి సాగుతున్న అస్స్పశ్యత, వివక్షలకు ముగింపు పలికామని పీకేఎస్ బృందం వెల్లడించింది. మలబార్ ప్రాంతంలో కాసర్ గాడ్ లో తొలుత అమలైందని పీకేఎస్ జిల్లా కార్యదర్శి బీఎం ప్రదీప్ చెప్పారు.

Read More : MLA Raja singh-CM KCR : సీఎం కేసీఆర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది : ఎమ్మెల్యే రాజాసింగ్

వాస్తవానికి ఆలయంలోనికి దళితుల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని 1947లోనే రద్దు చేసింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అనాగరిక పద్ధతి కొనసాగుతూనే ఉందని సమాచారం. ఇక ఈ ఆలయంలో 18 మెట్ల ద్వారా ఆలయంలోనికి ప్రవేశించడానికి అనుమతినివ్వలేదు. అంతేగాకుండా..కనీసం పూజలు చూసే వీలు కల్పించలేదు. కులం ప్రాతిపదికన ప్రసాదాన్ని విడివిడిగా పంచేవారని అంటారు. ప్రస్తుతం వీరిని ఆలయంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు