Delhi : మ‌హిళా రైతుల మీదకు దూసుకొచ్చిన ట్ర‌క్కు..ముగ్గురు మృతి

ఢిల్లీ – హ‌ర్యానా స‌రిహ‌ద్దులో రైతులు నిరసన కార్యక్రమం సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా దూసుకురావటంతో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందారు.

3 Women Farmers Died in Protest Site Haryana : ఢిల్లీ – హ‌ర్యానా స‌రిహ‌ద్దులో ఘోరం జ‌రిగింది. రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో ముగ్గురు మహిళా రైతుల మీదకు ఓ ట్రక్కు వేగంగా దూసుకురావటంతో ముగ్గురు మహిళలకు మృతి చెందారు. గురువారం (అక్టోబర్ 28,2021) ఉద‌యం గత కొన్నిరోజులుగా నిరసనలో పాల్గొన్న మహిళలు ఈరోజు ఉదయం తిరిగి వారి ఇళ్లకు వెళ్లేందుకు ఆటో కోసం డివైడర్‌పై కూర్చుని ఎదురుచూస్తున్నారు. అదేసమయంలో మ‌హిళ‌ల‌పై ఓ ట్ర‌క్కు దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రో మ‌హిళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రైతులు నిరసన తెలిపే స్థలానికి సమీపంలోనే సంభవించింది. మృతి చెందిన మ‌హిళ‌ల‌ను పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Read more : Maha Accident : ఒకేసారి ఢీకొన్న ఎనిమిది వాహనాలు.. ముగ్గురు మృతి

ప్ర‌మాదం జ‌రిగిన వెంటనే ట్ర‌క్కు డ్రైవ‌ర్ పారిపోయాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న కేంద్ర చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న టిక్రీ స‌రిహ‌ద్దు వ‌ద్ద చోటు చేసుకుంది. గ‌త 11 నెల‌ల నుంచి రైతులు కేంద్రానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న విష‌యం తెలిసిందే. అయనా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రావటంలేదు. వ్యవసాయ చట్టాలను అమలుచేసిన తీరుతామనే పట్టుదలతోనే ఉంది.

Read more : Major Road Accident : బైక్‌ని ఢీకొన్న లారీ.. తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

కానీ రైతులు మాత్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తోనే వారి నిరసనలను కొనసాగిస్తున్నారు. కాగా రైతు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. రైతుల నిరసన విషయంపై పలు దేశాలకు చెందిన అధినేతలు కూడా స్పందించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు