Delhi Liquor Scam: కవితకు ఈడీ నోటీసులు పంపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ తీవ్ర ఆగ్రహం

విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఆయా నేతలకు ఈడీ నుంచి నోటీసులు అందుతున్నాయని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై బీజేపీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. ఈడీ-సీబీఐకు బడ్జెట్ పెంచాలని ఆయన ఎద్దేవా చేశారు. వీధి వీధికి సీబీఐ, ఈడీ శాఖలు పెట్టాలని, ప్రశ్నించే వారిని అరెస్టు చేయాలని ఆయన చురకలు అంటించారు. బీజేపీకి అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలు అవసరం లేదని, విపక్షాలను వేధించడమే అవసరమని సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. రేపు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందదించారు. కేంద్ర సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.

విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఆయా నేతలకు ఈడీ నుంచి నోటీసులు అందుతున్నాయని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై బీజేపీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. ఈడీ-సీబీఐకు బడ్జెట్ పెంచాలని ఆయన ఎద్దేవా చేశారు. వీధి వీధికి సీబీఐ, ఈడీ శాఖలు పెట్టాలని, ప్రశ్నించే వారిని అరెస్టు చేయాలని ఆయన చురకలు అంటించారు. బీజేపీకి అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలు అవసరం లేదని, విపక్షాలను వేధించడమే అవసరమని సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. కవిత తరఫున అన్ని వ్యవహారాలు చూసుకున్న రామచంద్ర పిళ్లై నుంచి ఇప్పటికే ఈడీ పలు వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో అరెస్టు చేసింది. తదుపరి అరెస్టు ఎవరిది? అని సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కవితకు ఈడీ నుంచి నోటీసులు అందడంతో దీనిపై దుమారం చెలరేగుతోంది.

Delhi Liquor Scam..MLC Kavitha : విచారణకు రేపు రాలేను..15 తరువాతే వస్తా.. అంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ట్రెండింగ్ వార్తలు