Cm Revanth Reddy : బీజేపీ మత ఉచ్చులో పడొద్దు, రాహుల్‌కు అండగా నిలుద్దాం- సీఎం రేవంత్ రెడ్డి

ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

Cm Revanth Reddy : మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విశ్వనగరంలో బీజేపీ విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ మత ఉచ్చులో పడకండని రేవంత్ రెడ్డి కోరారు. సరూర్ నగర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్లపై దాడి చేయాలని మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారు. రాజ్యాంగం సంక్షోభంలో పడే సమయంలో ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేశారు.
ఇందిర మనమడు, సోనియా కొడుకు రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడడానికి తెలంగాణ గడ్డపైకి వచ్చి యుద్ధం ప్రకటించారు. తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ వైపు నిలబడాలి. రిజర్వేషన్లు కాపాడే పోరాటంలో మనమంతా రాహుల్ తో కలిసి నడవాలి.

15 సెకన్ల సమయం ఇస్తే ముస్లింలను తుద ముట్టిస్తామని బీజేపీ ఎంపీ అంటున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మత సామరస్యం పెంపొందించాం కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ కి వచ్చాయి. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా? మనకా వీళ్ళు హిందుత్వం నేర్పేది? అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బీజేపీ మత ఉచ్చులో పడకండి. 15 సెకన్లలో ముస్లింలను తుద ముట్టిస్తామని చెప్పిన బీజేపీ ఎంపీపై అమిత్ షా, మోదీ స్టాండ్ ఏంటో చెప్పాలి. ప్రధాని మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు” అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : బీజేపీతో మేము కలిసుంటే కవిత అరెస్ట్ అయ్యేవారా?- హరీశ్ రావు

ట్రెండింగ్ వార్తలు