Cm Jagan : చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమే- రాజంపేటలో సీఎం జగన్

పెత్తందార్ల కూటమిని వ్యతిరేకిస్తున్నా. మొట్ట మొదటిసారిగా మ్యానిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తెచ్చింది మీ బిడ్డ..

Cm Jagan : చంద్రబాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమే అని అన్నారు సీఎం జగన్. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలన్నీ అగిపోతాయని, ఇంటింటి అభివృద్ధి జరగదని సీఎం జగన్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొన్నారు. మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందన్నారు సీఎం జగన్.

ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావని.. ఈ ఎన్నికలు మన ఇంటింటి అభివృద్ధిని.. భవిష్యత్తును నిర్ణయించేవని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే, మళ్లీ మోసపోవడమే అని హెచ్చరించారు.

”పథకాలన్నీ కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలే. ఇంటింటి అభివృద్ధి జరగాలంటే మళ్ళీ మీ జగనే రావాలి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. సాధ్యం కాని హామీలు ఇచ్చారు చంద్రబాబు. దేశంలోనే చంద్రబాబు అంతటి అవినీతిపరుడు లేడని ఇదే ప్రధాని మోదీ అన్నారు. నేడు కూటమిలో చేరగానే అదే నోటితో ఇదే వ్యక్తిని పొగిడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకిస్తున్నా. మొట్ట మొదటిసారిగా మ్యానిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తెచ్చింది మీ బిడ్డ” అని సీఎం జగన్ అన్నారు.

”చంద్రబాబు ఇటీవలే ప్రధాని మోదీ, అమిత్ షాతో సభలు పెట్టించారు. పదేళ్ల క్రితమే రావాల్సిన ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ప్రజలంతా ఆశగా ఎదురుచూశారు. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు ఏం కావాలో అంతవరకే మాట్లాడారు. కూటమి అంటారు, డబుల్ ఇంజిన్ అంటారు.. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు కూటమి పెత్తందారుల కూటమి. మనం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధన కొనసాగిస్తున్నాం. కూటమి పెద్దల మనవళ్లు ఎక్కడ చదువుకుంటున్నారు? పేదల పిల్లలకు తెలుగు మీడియం చదువు ఉండాలట, పెద్దల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కావాలట. ఇలాంటి పెత్తందారీ భావజాలం ఉన్న వారు ఓటు కావాలని అడుగుతున్నారు. వీళ్లు అధికారంలోకి వస్తే పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తారా?” అని సీఎం జగన్ ప్రశ్నించారు.

Also Read : నాడు కారు ఈఎంఐ కట్టలేని పవన్ కల్యాణ్ ఆస్తులు ఇప్పుడు 2వేల కోట్లు..!- పోతిన మహేశ్

 

ట్రెండింగ్ వార్తలు