Disease Management : కందలో సూక్ష్మదాతు లోపం, చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు తెగులు, మోజాయిక్ తెగులు ఆశిస్తుంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుంచి 100 పుట్ల దిగుబడి సాధించవచ్చు.

Disease Management : వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలలోను, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులోవుంది.  కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విత్తిన కంద మొలకెత్తే దశలో ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో విత్తడానికి సిద్ధమవుతున్నారు. అయితే పంట పెరిగే కొద్ది సూక్ష్మదాతు లోపాలు , చీడపీడలు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించేందుకు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం   సీనియర్ శాస్త్రవేత్త డా. పి. సుధా జాకబ్ రైతులకు పలు సూచనలు తెలియజేస్తున్నారు.

READ ALSO : Kanda Yam Cultivation : కంద సాగుతో మంచి ఆదాయం.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు !

కంద  దుంప జాతికి చెందిన పంట. మన రాష్ట్రంలో దుంప పంటలలో కంద వాణిజ్య ప్రాముఖ్యం కలిగి పంట. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. సాధారణంగా  కంద 25 నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత మధ్య బాగాపెరిగి, మంచి దిగుబడి ఇస్తుంది. భారతదేశం లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగుచేస్తుంటారు.

కోస్తా జిల్లాలలో అధికంగా సాగులో వుంది. చాల చోట్ల ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధపడుతున్నారు రైతులు.  కంద విత్తిన చోట ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో నీటి తడులు సరిగా లేకపోతే మొక్కల్లో సూక్ష్మపోషకాల లోపాలు కనిపిస్తాయి.   మొలక వచ్చిన తరువాత ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడులను అందించాలి. సూక్ష్మధాతు లోపాలు కనిపించినప్పుడు వెంటనే తగిన పోషకాలతో వీటిని సవరించాలి.

READ ALSO : Benda Cultivation : బెండ సాగులో తెగుళ్ళు.. నివారణ చర్యలు !

కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు తెగులు, మోజాయిక్ తెగులు ఆశిస్తుంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుంచి 100 పుట్ల దిగుబడి సాధించవచ్చు. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా కంద సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు అధికంగా వున్నా నష్టభయం లేని పంటగా కందసాగు రైతుకు మంచి ఫలితాలను అందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు