T.Cong : కాంగ్రెస్‌‌లో వర్గ విభేదాలు..కోమటిరెడ్డి ఫ్లెక్సీల చించివేత

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరిట ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడం హాట్ టాపిక్ అయ్యింది.

Komatireddy Venkat Reddy Flexes : మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరిట ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడం హాట్ టాపిక్ అయ్యింది. పార్టీలో ఓ వర్గానికి చెందిన వారు..ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు, కటౌట్లను బ్లేడ్లతో కత్తిరించి వేశారు. దీంతో పార్టీలో మరోసారి వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. కొంపల్లిలోని ఫంక్షన్ హాల్ లో ఈ నెల 09, 10వ తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించ తలపెట్టింది. జన జాగరణ యాత్ర పేరిట ఓ సదస్సు కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Read More : Greek Businessman : రూ.16 లక్షలను చెత్త బుట్టలో పడేసిన వ్యాపారి!

దీంతో నాయకుల పేరిట… కొంతమంది కార్యకర్తలు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, కటౌట్లను ఏర్పాటు చేశారు. అందులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డివి కూడా ఉన్నాయి. ఆదివారం భారీ హోర్డింగ్, కటౌట్లను ఏర్పాటు చేశారు. 2021, నవంబర్ 08వ తేదీ సోమవారం ఫ్లెక్సీలు చించివేసి ఉండడం కలకలం రేపింది. బ్లేడ్లతో కత్తిరించి ఉండడం..కొన్ని చోట్ల పూర్తిగా చింపేసి ఉండడంతో కోమటిరెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీటిని కోమటిరెడ్డి అనుచరుడైన మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇతను ఏర్పాటు చేసిన వాటిని తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : Oreo Pakode : ఓరియో బిస్కెట్లతో పకోడీ..వీడియో వైరల్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి..ఎంపీగా గెలిచారు. అయితే..కాంగ్రెస్ పార్టీలో ఉంటూ..పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారాయన. కామారెడ్డి – ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమాన్ని మొదలు పెడుతానని, తన సంగతి ఏంటో చూపిస్తానని ఇటీవలే ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ పార్టీకి చెందిన కొంతమంది నేతలు…సోనియా గాంధీని దయ్యం..అని…ఇప్పుడు దేవత అంటున్నారంటూ..ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. కొంతకాలం నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేత వీహెచ్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా..ఫ్లెక్సీలను తొలగించడంపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు