Cyclone Biparjoy Brings Heavy Rain: రాజస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు, నలుగురి మృతి

రాజస్థాన్ రాష్ట్రంలో బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.రాజస్థాన్‌లోని బార్మర్, రాజ్‌సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు....

రాజస్థాన్ రాష్ట్రంలో వెల్లువెత్తిన వరదలు

Cyclone Biparjoy Brings Floods: రాజస్థాన్ రాష్ట్రంలో బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.రాజస్థాన్‌లోని బార్మర్, రాజ్‌సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు.(Flood-Like Situation) రాజస్థాన్‌లోని( Rajasthan) జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాల్లో వరదల బారిన పడిన ఆదివారం 59 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.జలోర్‌లోని భిన్మల్ పట్టణంలోని వరద ప్రభావిత ఓడ్ బస్తీలో చిక్కుకుపోయిన 39 మంది పౌరులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర విపత్తు సహాయ దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) కమాండెంట్ రాజ్‌కుమార్ గుప్తా చెప్పారు.

GVL Narasimha Rao : రాష్ట్రంలో ప్రమాదకర స్థితిలో శాంతిభద్రతలు : ఎంపీ జీవీఎల్

బార్మర్ జిల్లాలోని ధౌరిమన్న పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోవడంతో ఇళ్లలో చిక్కుకుపోయిన 20 మందిని సహాయ సిబ్బంది రక్షించారు.ఆదివారం ఉదయం గంగాసర గ్రామంలోని చెరువులో ఇద్దరు సోదరులు మునిగి మృతి చెందినట్లు బార్మర్ సేవదా పోలీస్ స్టేషన్ అధికారి హన్సారాం తెలిపారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.బఘోటా గ్రామంలో భారీవర్షాల వల్ల ప్రేమ్‌సింగ్ రాజ్‌పుత్ (45) మృతి చెందారు. కెల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇంటి బాల్కనీ లాలీ బాయి (48)పై పడి మృతి చెందారని రాజ్‌సమంద్ పోలీసు కంట్రోల్ రూమ్ తెలిపింది.

Moeen Ali : చేతులకు స్ప్రే చేసుకుంటూ క‌నిపించిన ఆట‌గాడు.. భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ

రాబోయే 20 గంటల్లో భారీవర్షాలు(Biparjoy Brings Heavy Rain) కురిసే అవకాశం ఉన్నందున తమ సహాయ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని రాజస్థాన్ విపత్తు, సహాయ కార్యదర్శి పి సి కిషన్ చెప్పారు. పింద్వారా, అబు రోడ్‌, రేవార్‌లోని పలు డ్యామ్‌లు ఇప్పుడు వరదనీటితో నిండాయి. సిరోహిలోని బతిసా డ్యామ్ నీటిమట్టం 315 మీటర్లు కాగా, డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలిలోని ఐరన్‌ పురా రోడ్డులో 226మిల్లీమీటర్లు, సిరోహిలో 155, జలోర్‌లో 123, జోధ్‌పూర్‌ సిటీలో 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని జలోర్, సిరోహి, బార్మర్, పాలి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదైందని జైపూర్ వాతావరణ కేంద్రం ఇన్‌ఛార్జ్ రాధేశ్యామ్ శర్మ తెలిపారు.

Anasuya : బికినిలో బీచ్ వద్ద ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ..

పాలి, రాజ్‌సమంద్‌, అజ్మీర్‌, ఉదయ్‌పూర్‌ జిల్లాలు, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.రానున్న 24 గంటల్లో అజ్మీర్, ఉదయ్‌పూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శర్మ తెలిపారు.రానున్న 24 గంటలపాటు పాలి, సిరోహి, రాజ్‌సమంద్‌, ఉదయ్‌పూర్‌లలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించామని అదికారులు తెలిపారు. అజ్మీర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, దుంగార్‌పూర్, టోంక్, బుండి, జైపూర్, నాగౌర్, జలోర్‌లోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. హనుమాన్‌గఢ్, గంగానగర్, చురు, బికనీర్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని శర్మ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు