Mr Bachchan: రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల.. అదిరిపోయిందంతే..

ఈ సినిమాలోని యాక్షన్ సీన్లను ఈ టీజర్‌లో చూపించారు. 

Mr Bachchan: రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల.. అదిరిపోయిందంతే..

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాను మిస్టర్ బచ్చన్ టీజర్ ఇవాళ విడుదలైంది. ఈ సినిమాలో జగపతిబాబు, భాగ్యశ్రీ బోర్సే, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలోని యాక్షన్ సీన్లను ఈ టీజర్‌లో చూపించారు. రవితేజ ఫైటింగ్ అదుర్స్ అనిపిస్తోంది. ‘‘సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి.. వస్తుంటాయి, పోతుంటాయి.. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది.. పోయేదాకా మనతోనే ఉంటుంది’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

ఈ సినిమాలో రవితేజ యాక్షన్‌తో పాటు కామెడీని కూడా ఇరగదీసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. టీజర్ లో మొదట హీరో, హీరోయిన్ మధ్య ఉండే లవ్ సీన్స్ చూపించారు. చుట్ట కాల్చుతూ, చదరంగం ఆడుతూ జగపతి బాబు కనపడిన తీరు ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టిస్తోంది.

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన రెప్పల్‌.. డప్పుల్‌ పాట అందరినీ అలరించింది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించాడు.

Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ వచ్చేసింది.. ఇద్దరు హీరోయిన్స్ తో విశ్వక్..