Ram Charan – Pithapuram : ‘చిరుత’ సినిమాకు టికెట్లు దొరక్కపోతే.. ‘పిఠాపురం’ వెళ్లి మరీ బెనిఫిట్ షో చూసిన హీరో..

ప్రమోషన్స్ లో భాగంగా అశ్విన్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పిఠాపురం గురించి రావడంతో చిరుత సినిమా సంఘటన గురించి మాట్లాడుతూ..

Ram Charan – Pithapuram : ‘చిరుత’ సినిమాకు టికెట్లు దొరక్కపోతే.. ‘పిఠాపురం’ వెళ్లి మరీ బెనిఫిట్ షో చూసిన హీరో..

Hero Ashwin Babu Interesting Comments on Ram Charan and Pithapuram

Updated On : July 28, 2024 / 10:20 AM IST

Ram Charan – Pithapuram : మెగాస్టార్ కొడుకుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్ఛాడు. రామ్ చరణ్ చిరుత రిలీజ్ సమయంలో మెగాస్టార్ కొడుకు కావడంతో తెలుగు ప్రజలు అంతా ఆ సినిమా కోసం ఎదురుచూసి, అభిమానులైతే తమ హీరో కొడుకు ఎలా చేసాడు అని చూడటానికి సినిమాకి ఫస్ట్ డేనే వెళ్లి సందడి చేసారు. చిరుత సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతోనే మెగాస్టార్ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చాడు చరణ్ అని అన్నారు.

అయితే తాజాగా ఓ హీరో చిరుత సినిమా రిలిజ్ సమయంలో జరిగిన సంఘటనని మీడియాతో పంచుకున్నాడు. ఓంకార్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు కొత్త కొత్త కథలతో దూసుకెళ్తున్నారు. అశ్విన్ బాబు హీరోగా నటించిన శివం భజే సినిమా ఆగస్టు 1 రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మూవీ యూనిట్.

Also Read : Dhanush : డైరెక్టర్‌గా ధనుష్.. యాక్టింగ్ కూడా ఎలా చేసి చూపిస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్..

ప్రమోషన్స్ లో భాగంగా అశ్విన్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పిఠాపురం గురించి రావడంతో చిరుత సినిమా సంఘటన గురించి మాట్లాడుతూ.. చిరుత సినిమాకు టికెట్స్ దొరక్కపోతే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లి పొద్దున్నే 4.30కి బెనిఫిట్ షో చూసాను. ఒకప్పుడు కాకినాడ దగ్గర పిఠాపురం అనేవాళ్ళు. ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. నేను అక్కడి ఏరియాకు చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం గర్వంగా ఉంది అని అన్నారు. దీంతో అశ్విన్ బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా చరణ్ అభిమానులు, పవన్ అభిమానులు కూడా ఈ కామెంట్స్ ని తెగ షేర్ చేస్తున్నారు.