Dulquer Salmaan : దుల్కర్‌ మరో తెలుగు సినిమా.. కల్కి నిర్మాతలతో.. ‘ఆకాశంలో ఒక తార’ అంటూ..

తాజాగా మరో తెలుగు సినిమాని ప్రకటించాడు దుల్కర్.

Dulquer Salmaan : దుల్కర్‌ మరో తెలుగు సినిమా.. కల్కి నిర్మాతలతో.. ‘ఆకాశంలో ఒక తార’ అంటూ..

Dulquer Salmaan Announced new Telugu Movie with Kalki Producers

Updated On : July 28, 2024 / 10:53 AM IST

Dulquer Salmaan : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల వరుసగా తెలుగు సినిమాలతో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీతారామంతో మంచి మార్కెట్ తెచ్చుకున్న దుల్కర్ తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల కల్కి సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేసాడు. త్వరలో లక్కీ భాస్కర్ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా మరో తెలుగు సినిమాని ప్రకటించాడు దుల్కర్.

Also Read : Ram Charan – Pithapuram : ‘చిరుత’ సినిమాకు టికెట్లు దొరక్కపోతే.. ‘పిఠాపురం’ వెళ్లి మరీ బెనిఫిట్ షో చూసిన హీరో..

స్వప్న సినిమాస్, గీత ఆర్ట్స్, లైట్ బాక్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా కలిసి దుల్కర్ తో సినిమాని ప్రకటించాయి. తాజాగా ఈ సినిమాని ప్రకటిస్తూ ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ని ప్రకటించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.