Citroen Basalt : టాటా కర్వ్‌కి పోటీగా సిట్రోయెన్ బసాల్ట్ కారు వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు రివీల్..!

Citroen Basalt : భారత మార్కెట్లో మాస్-మార్కెట్ ఎస్‌యూవీ-కూపే మోడల్‌లు ఏవీ లేవు. ఫ్రంట్ సైడ్ సి3 ఎయిర్‌క్రాస్‌లో డిజైన్‌ సహా కొన్ని ఫీచర్లలో చిన్న మార్పులతో వస్తుంది.

Citroen Basalt : టాటా కర్వ్‌కి పోటీగా సిట్రోయెన్ బసాల్ట్ కారు వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు రివీల్..!

Tata Curvv-rival Citroen Basalt revealed ahead of launch ( Image Source : Google )

Updated On : July 28, 2024 / 8:58 PM IST

Citroen Basalt : ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ప్రొడక్షన్-స్పెక్ బసాల్ట్ మరిన్ని ఫీచర్లను వెల్లడించింది. సిట్రోయెన్ కొత్త మోడల్ కార్లలో సి3, సి3 ఎయిర్‌క్రాస్, ఇ-సి3 మాదిరిగా అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకే డిజైన్ ల్వాంగేజీని కలిగి ఉంటుంది. సిట్రోయెన్ బసాల్ట్ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రధానంగా కారు బ్యాక్ సైడ్.. బూట్‌లిడ్‌లో పదునైన రూఫ్‌లైన్‌తో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎస్‌యూవీ-కూపే డిజైన్ అందిస్తుంది.

Read Also : Xiaomi SU7 Electric Car : షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!

ప్రస్తుతానికి, భారత మార్కెట్లో మాస్-మార్కెట్ ఎస్‌యూవీ-కూపే మోడల్‌లు ఏవీ లేవు. ఫ్రంట్ సైడ్ సి3 ఎయిర్‌క్రాస్‌లో డిజైన్‌ను పొందుతుంది. కానీ, ఇతర మోడల్స్ నుంచి వేరుగా గుర్తించడానికి కొన్ని ఫీచర్లలో చిన్న మార్పులతో వస్తుంది. ముందుగా బ్రాండ్ షేర్ చేసిన కాన్సెప్ట్ ఇమేజ్‌ల మాదిరిగా కాకుండా.. ప్రొడక్షన్-స్పెక్ బసాల్ట్ చిన్న అల్లాయ్ వీల్స్‌ను పొందింది. టెయిల్‌ల్యాంప్‌లు ఇతర సిట్రోయెన్ ఉత్పత్తులలో మాదిరిగా ఉంటుంది. కానీ విశాలంగా ఉంటాయి. బూట్‌లిడ్, బ్యాక్ సైడ్ విండ్‌షీల్డ్ కలిగి ఉంటాయి. బూట్‌కు యాక్సెస్ అందిస్తుంది.

ప్రస్తుతానికి సిట్రోయెన్ బసాల్ట్ ఇంటీరియర్‌లు లేఅవుట్ సి3 ఎయిర్‌క్రాస్‌లో కనిపించే విధంగానే ఉంటుందని భావిస్తున్నారు. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన బిగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

సి3 ఎయిర్‌క్రాస్‌కు శక్తినిచ్చే అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో సిట్రోయెన్ బసాల్ట్ పవర్ పొందుతుంది. 110బీహెచ్‌పీ, 205ఎన్ఎమ్ టార్క్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది. బసాల్ట్ సి3 ఎయిర్‌క్రాస్ ధరతో సమానమైన ధరను కలిగి ఉంటుంది. అయితే, ఈ కారు ధరను రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది.

Read Also : Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!