Cervical Cancer : క్యాన్సర్ అనేది అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఒకసారి శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చిందంటే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. క్యాన్సర్ వచ్చిన బాధితుల్లో జీవితమే అంధకారంగా ఉంటుంది. గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ వస్తే.. మహిళలకు తల్లి అయ్యే అవకాశాలు తక్కువ.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకుకు చెందిన 27 ఏళ్ల యువతికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ అయింది. గర్భసంచి తొలగించడమే దారని చాలామంది వైద్యులు సూచించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి రాగా ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స చేసిన డాక్టర్ వసుంధర చీపురుపల్లి పూర్తి వివరాలను తెలియజేశారు.
Read Also : CAPA-IVM Baby : ఏపీలో ఫస్ట్ సీఏపీఏ ఐవీఎమ్ బేబీ జననం.. ఘనంగా బేబీ షవర్ వేడుక!
తణుకుకు చెందిన మౌనిక అనే 27 ఏళ్ల యువతికి గర్భం దాల్చింది. అయితే, గర్భంలోని శిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. దాంతో గర్భస్రావం చేయించారు. మౌనిక ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు చేయగా, ఆమెకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. వెంటనే గర్భసంచి తొలగించాలని వైద్యులు సూచించారు. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ కోసం వచ్చారు.
ముందుగానే పిండాలను ఫ్రీజ్ చేసి.. :
క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అనంతరం ఫ్రీజ్ చేసిన పిండాలను గర్భసంచిలో ప్రవేశపెట్టగా రెండూ ఫలదీకరణం చెందాయి. కుట్లు వేయడంతో గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండదని ముందుజాగ్రత్తగా ఒక పిండాన్ని తొలగించారు. ఒక పిండాన్నే ఉంచారు. మధ్యలో క్యాన్సర్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు చేశారు. 32 వారాల తర్వాత శిశువుకు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు వేశారు. సరిగ్గా 37 వారాల తర్వాత సిజేరియన్ చేయడంతో పండంటి పాప పుట్టింది.
పాప పుట్టిన తర్వాతే ఆమెకు క్యాన్సర్ వచ్చిందని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా గర్భసంచి తొలగించాల్సిందిగా దంపతులు కోరారు. కానీ, సిజేరియన్ సమయంలో హిస్టరెక్టమీ చేస్తే మరిన్ని ఇబ్బందులు ఉంటాయని భావించారు. ఇప్పుడు క్యాన్సర్ సమస్య లేదని అలానే వదిలేస్తే మంచిదని సూచించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్ చీపురుపల్లి వసుంధర పేర్కొన్నారు. మొదట్లో పిల్లలు పుట్టే అవకాశం లేదని భావించినప్పటికీ, ఆస్పత్రి బృందం నచ్చజెప్పటంతో ఆరోగ్యకరమైన పాప పుట్టింది. చాలా సంతోషంగా ఉందని మౌనిక భర్త మహేష్ ఆనందం వ్యక్తం చేశాడు.
Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!