CAPA-IVM Baby : ఏపీలో ఫస్ట్ సీఏపీఏ ఐవీఎమ్ బేబీ జననం.. ఘనంగా బేబీ షవర్ వేడుక!

సీఏపీఏ ఐవీఎం (ఇన్ విట్రో మెచ్యూరేషన్) అనేది సంతాన సాఫల్య విజయాల రేటును గణనీయంగా పెంచే ఒక అద్భుత సాంకేతికత.

CAPA-IVM Baby : ఏపీలో ఫస్ట్ సీఏపీఏ ఐవీఎమ్ బేబీ జననం.. ఘనంగా బేబీ షవర్ వేడుక!

CAPA-IVM baby born in Andhrapradesh touted ( Image Source : Google )

Updated On : July 24, 2024 / 7:55 PM IST

CAPA-IVM Baby : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సీఏపీఏ ఐవీఎమ్ బేబీ జన్మించింది. భారత్‌లో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం ఒయాసిస్ ఫెర్టిలిటీ చికిత్స ద్వారా ఈ ఐవీఎం శిశువు జన్మించింది. ఈ సందర్భంగా బేబీ షవర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంతాన సాఫల్యం చికిత్స, సంరక్షణలో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడంతో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

Read Also : స్పైడర్‌మ్యాన్ గెటప్‌లో కారుతో డేంజర్ ఫీట్స్.. ఆట కట్టించిన హస్తిన పోలీసులు

కర్నూలు కేంద్రం సమీప ప్రాంతాల్లోని అనేక మంది జంటల్లో మరింత విశ్వాసాన్ని పొందిన ఒయాసిస్ ఫెర్టిలిటీ.. వినూత్న సంతాన సాఫల్య చికిత్సలకు మార్గదర్శకత్వం వహిస్తోంది. సీఏపీఏ ఐవీఎం (ఇన్ విట్రో మెచ్యూరేషన్) అనేది సంతాన సాఫల్య విజయాల రేటును గణనీయంగా పెంచే ఒక అద్భుత సాంకేతికత. వంధ్యత్వ సవాళ్లను ఎదుర్కొంటున్న జంటల్లో కొత్త ఆశలను రేకితిస్తోంది.

సంతాన సాఫల్య సంరక్షణలో ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రం.. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అనూప్లోయిడీస్ కోసం (PGT-A) వంటి అధునాతన చికిత్సలతో క్లినికల్ ఎక్సలెన్స్‌ అందిస్తోంది. గర్భధారణ సవాళ్లను ఎదుర్కొంటున్న జంటలు, క్రోమోజోమ్ అసాధారణత కలిగిన కుటుంబాలు, ఆరోగ్యకరమైన జీవసంబంధమైన పిల్లల పుట్టుకకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. అందులో డ్రగ్-ఫ్రీ ఐవీఎఫ్ ఆప్షన్ “సీఏపీఏ ఇన్ విట్రో మెచ్యూరేషన్”ను మొదటిసారిగా అందించింది.

ఈ కేంద్రం 2,500 మంది సంతానం లేని జంటలను పరీక్షించింది. 300 జంటలకు ఐవీఎఫ్ చికిత్సలను అందించింది. పిండం జన్యు పరీక్షకు సంబంధించి సీఏపీఏ ఐవీఎం, పీజీటీ- ఏ (ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) వంటి ఇతర అధునాతన విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పురుషుల కోసం సంతానసాఫల్య కేంద్రంలో అండ్రోలైఫ్ ద్వారా ప్రత్యేక సేవలను అందిస్తోంది. నిపుణులైన వైద్యులు మైక్రో టీఈఎస్ఏ, టీఈఎస్ఏ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి తగిన చికిత్సలను అందిస్తారు.

Read Also : Billionaire Yusuff Ali : అభిమానం అంటే ఇదే భయ్యా.. బిలియనీర్‌కు భలే గిఫ్ట్ ఇచ్చాడుగా..!