Telangana Farmers : తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు.

Good News for Telangana Farmers : తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే తేమశాతం లేకుండా ధాన్యాన్ని తీసుకురావలని సీఎం సూచించారు. తెలంగాణలో 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
CM Jagan : కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. సీఎం జగన్ కీలక నిర్ణయం

ప్రగతి భవన్‌లో సోమవారం (అక్టోబర్ 10) ధాన్యం కొనుగోలుపై కేసీఆర్‌ సమీక్ష జరిపారు. గత ఏడాదిలో మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామన్నారు. గత సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది కూడా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమశాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులుకు కేసీఆర్ సూచనలు చేశారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలుకు కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

PF ఖాతా ఉందా? ఉచితంగానే రూ.7 లక్షలు పొందొచ్చు.. ఎలాగంటే..

ట్రెండింగ్ వార్తలు