OTT Release: ఓటీటీల హవా.. థియేటర్లను బీట్ చేసే కంటెంట్ సిద్ధం!

ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి ధియేటర్లతో పాటు ఓటీటీలు కూడా వీకెండ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వారం ధియేటర్లో పెద్దగా..

OTT Release: ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి ధియేటర్లతో పాటు ఓటీటీలు కూడా వీకెండ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వారం ధియేటర్లో పెద్దగా సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో ఓటీటీలో తెలుగు, తమిళ్ తో పాటు హిందీ, హాలీవుడ్ ఇంట్రస్టింగ్ సిరీస్, సినిమాలు కూడా ఎంగేజ్ చెయ్యబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలు, ధియేటర్లో ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మొన్నటి వరకూ ఆర్ఆర్ఆర్ ధియేటర్లో రోరింగ్ రన్ అవుతుండగానే.. రాకీ భాయ్ కెజిఎఫ్ 2తో చెలరేగిపోతున్నాడు. బ్లాక్ బస్టర్ సక్సెస్ తో రికార్డులు దుమ్ము దులుపుతున్న కెజిఎఫ్ 2 దెబ్బకి మిగతా సినిమాలేవీ రిలీజ్ పెట్టుకోలేదు. సౌత్ సినిమాలు ధియేటర్ రిలీజ్ పెట్టుకోలేదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం.. జెర్సీ మూవీ రిలీజ్ అవుతోంది. ఇదిగో రిలీజ్.. అదిగో సినిమా అంటూ.. 6 నెలల నుంచి చాలాసార్లు పోస్ట్ పోన్ చేసుకున్న షాహిద్ కపూర్ జెర్సీ మూవీ ఫైనల్లీ ఎవరూ లేని టైమ్ చూసుకుని ఏప్రిల్ 22న ధియేటర్లోకొస్తోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెలుగులో నాని చేసిన జెర్సీ మూవీ హిందీలో రీమేక్ గా జెర్సీ టైటిల్ తోనే రిలీజ్ అవుతోంది.

Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

ఈ వారం తెలుగులో రిలీజ్ అవ్వాల్సిన సనిమాలన్నీ పోస్ట్ పోన్ చేసేసుకున్నాయి. కానీ ఓటీటీలు మాత్రం ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. స్పెషల్లీ తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త సినిమాల్ని కొత్త కంటెంట్ ని ఆడియన్స్ ని అందించే ఆహా ఓటీటీ.. పవర్ పంచ్ లతో ధియేటర్లోకొచ్చిన వరుణ్ తేజ్ మూవీ గని సినిమాని రిలీజ్ చేస్తోంది. వరుణ్ తేజ్, సాయిమంజ్రేకర్ జంటగా సాయికొర్రపాటి డైరెక్ట్ చేసిన గని మూవీ ఏప్రిల్ 22 నుంచి ఆహా ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తోంది. ఆహలోనే మరో క్రేజీ షో ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా టాప్ సెలబ్రిటీస్ తో ఆటాడుకునే క్రేజీ ఎంటర్ టైనింగ్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 2 ఏప్రిల్ 22 నుంచి ఆహా సబ్ స్క్రైబర్స్ కి అవైలబుల్ గా ఉంటోంది.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

తమిళ్ సీనియర్ స్టార్ విజయ్, ఆయన కొడుకు అరుణ్ విజయ్, మనవడు అర్నవ్ విజయ్ లీడ్ రోల్స్ లో తాత, తండ్రి, మనవడు ముగ్గురూ కలిసి నటించిన మూవీ ఓమైడాగ్. ఈ క్రేజీ కామెడీ డ్రామా ఎంటర్ టైనర్.. తెలుగు, తమిళ్ లో అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ప్రకాష్ రాజ్, సంపత్ లీడ్ రోల్స్ లో తమిళ్ లో తెరకెక్కిన అనంతం సిరీస్.. ఏప్రిల్ 22 నుంచి జీ 5లో ప్రసారం కాబోతోంది. మళయాళ సూపర్ క్రేజీ డ్రామా సినిమా అంతాక్షరి సోనీ లివ్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతోంది.

OTT Films: బాలీవుడ్ సినిమాలపై ఓటీటీల స్పెషల్ ఇంట్రెస్ట్..!

బాలీవుడ్ కి సంబంధించి స్మాల్ స్క్రీన్ లో భారీ టీఆర్పీలను సాధిస్తున్న విమెన్ ఓరియంటెడ్ సీరియల్ అనుపమ.. ఈ వారం నుంచి నమస్తే అమెరికా అంటూ కొత్త టర్న్ తీసుకుంది. ఈ క్రేజీ సీరియల్.. ఏప్రిల్ 25నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో అవైలబుల్ అవుతోంది. బాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన స్నూకర్ బ్యాక్ డ్రాప్ మూవీ తులసీదీస్ జూనియర్ నెట్ ఫ్లిక్స్ లో మరో రెండురోజుల్లో స్ట్రీమ్ అవుతోంది.

Anita Hassanandani: భర్తతో కలిసి కండోమ్ వాడకం గురించి చెప్పిన హీరోయిన్!

హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కామెడీ క్రైమ్ సిరీస్ అయిన బెటర్ కాల్ సాల్ సీజన్ 6 నెట్ ఫ్లిక్స్ లో రెండురోజుల్లో అవైలబుబల్ గా ఉంటోంది. జపనీస్ క్రేజీ కామెడీ డ్రామా హి ఈజ్ ఎక్స్ పెక్టింగ్ టీవీ షో నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 21న స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ అన్ ఎక్స్ పెక్టెడ్ ఈవెంట్స్ అంటూ ప్రెగ్నెంట్ అయిన అబ్బాయి స్టోరీయే హి ఈజ్ ఎక్స్ పెక్టింగ్ షో.

Theatres: టాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాల విషయంలో గొడవ.. OTTలో? థియేటర్లలో?

హిందీలో అర్జున్ రాంపాల్ లీడ్ రోల్ లో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన టీవీ షో ఏప్రిల్ 21నుంచి వూట్ యాప్ లో స్ట్రీమ్ అవ్వబోతోంది. సమాజంలో జరిగిన ఏ తప్పునైనా సరే కరెక్ట్ అని ప్రైవ్ చేస్తూ.. ఒప్పుల్ని తప్పులుగా మార్చేస్తున్న కోర్టులు, లాయర్ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గిల్టీ మైండ్స్ సిరీస్.. ఏప్రిల్ 22 న అమెజాన్ లో రిలీజ్ కాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు