Modi Surname Case: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ

ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు ఆయనపై దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు పేర్కొంది.

Rahul Gandhi: మోదీ ఇంటిపేరుపై అనుచితంగా వ్యాఖ్యానించి పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రాహుల్ వేసిన పిటిషన్ మీద విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. శిక్ష విధించడం అన్యాయం కాదని, రాహుల్ గాంధీపై కనీసం 10 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

Musk vs Mark: ముదురుతున్న వివాదం.. చీటింగ్ చేస్తున్నారంటూ జూకర్‭బర్గ్‭పై ఎలాన్ మస్క్ ఫైర్

ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు ఆయనపై దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు పేర్కొంది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైందని, చట్టబద్ధమైందని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. శిక్షపై స్టే నిరాకరించడం వల్ల రాహుల్ గాంధీకి అన్యాయం జరిగినట్లు కాదని కోర్టు పేర్కొంది.

PM Modi: అత్యంత కీలకంగా ప్రధాని ‘వరంగల్ పర్యటన’.. 10 వేల మంది పోలీసుల పహారా.. పర్యటన మినట్ టు మినట్ వివరాలు ఇవే

“శిక్షపై స్టే విధించడానికి సహేతుకమైన కారణం లేదు. శిక్ష విధించబడిన ఉత్తర్వు సరైనది, చట్టబద్ధమైనది కూడా. ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించబడిన ఉత్తర్వు సరైనది. ట్రయల్ కోర్టు పేర్కొన్న ఉత్తర్వుతో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. అనర్హత కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కాదు” అని హైకోర్టు చెప్పింది. ఆయనపై పడ్డ అనర్హత వేటు కారణంగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దైంది. అలాగే ఎనిమిది ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానకి అర్హత కోల్పోయారు.

Manipur Violence: మణిపూర్ విషయంలో కలుగజేసుకుంటామన్న అమెరికా.. మీ వ్యవహారాల్లో వేలు పెట్టలేదంటూ చురకలు అంటించిన కాంగ్రెస్ నేత

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు మేరకుమార్చి 23న సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత, గాంధీ తరపు న్యాయవాది కిరీట్ పన్వాలా ఈ తీర్పుపై సూరత్ అదనపు సెషన్ న్యాయస్థానం ఆర్‌పి మొగెరాలో అప్పీలుకు దరఖాస్తు చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు