Manipur Violence: మణిపూర్ విషయంలో కలుగజేసుకుంటామన్న అమెరికా.. మీ వ్యవహారాల్లో వేలు పెట్టలేదంటూ చురకలు అంటించిన కాంగ్రెస్ నేత

ఇది వ్యూహాత్మక ఆందోళనలకు సంబంధించిన అంశమని నేను అనుకోవడం లేదు. ఇది మానవ ఆందోళనలకు సంబంధించిన విషయం. ఈ విధమైన హింసలో పిల్లలు, వ్యక్తులు చనిపోయినప్పుడు పట్టించుకోవడానికి భారతీయులే కానవసరం లేదు

USA Ambassador: రెండు నెలలుగా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‭‭లో కలుగజేసుకునేందుకు అమెరికా ఆసక్తి చూపిస్తోంది. భారత్ అడిగితే ఆ వ్యవహారంలో చొరవ తీసుకుని శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తామంటూ భారత్‭లో అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టీ అన్నారు. అయితే అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఎంపీ మనీష్ తివారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికాలో అనేక కాల్పుల ఘటనలు జరుగుతున్నాయని, అందులో కలుగజేసుకుంటామని తామెప్పుడూ అడగలేదని అన్నారు. అంతే కాకుండా భారత్ ఇలాంటి సంక్షోభాలు అనేకం ఎదుర్కొని నిలిచిందని, ఎప్పుడూ ఎవరి నుంచి సహాయం కోరలేదని తివారీ అన్నారు.

Musk vs Mark: ముదురుతున్న వివాదం.. చీటింగ్ చేస్తున్నారంటూ జూకర్‭బర్గ్‭పై ఎలాన్ మస్క్ ఫైర్

గరువారం ఓ సందర్భంలో అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టీ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇది వ్యూహాత్మక ఆందోళనలకు సంబంధించిన అంశమని నేను అనుకోవడం లేదు. ఇది మానవ ఆందోళనలకు సంబంధించిన విషయం. ఈ విధమైన హింసలో పిల్లలు, వ్యక్తులు చనిపోయినప్పుడు పట్టించుకోవడానికి భారతీయులే కానవసరం లేదు. శాంతి నెలకొల్పడం అనేది చాలా ముఖ్యమైన విషయమని మనందరికి తెలుసు. ఈశాన్య, తూర్పు ప్రాంతాలలో పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉంది. అడిగితే ఏ విధంగానైనా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది భారత అంతర్గత విషయమని మాకు తెలుసు. అయితే శాంతి త్వరితగతిన ఏర్పడాలని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఆ శాంతి ఉంటే మనం మరింత సహకారంతో ఉంటాం. మరిన్ని ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకురాగలం’’ అని అన్నారు.

Nithyananda Kailasa PM Ranjitha : నిత్యానంద ‘కైలాస’ దేశానికి ప్రధానిగా నిత్యానందమయి అలియాస్ నటి రంజిత

ఈ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ నేత మనీష్ తివారీ స్పందిస్తూ ‘‘మణిపూర్‌లో జరుగుతున్నది విషాదకరం. ప్రధానమంత్రి అక్కడికి చాలా ముందుగానే వెళ్లి మాట్లాడి ఉండాల్సింది. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు హోంమంత్రి నిరంతరం పర్యటించాలి. ఈ అంశాన్ని మేము పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. ఇక అమెరికా రాయబారి విషయానికొస్తే.. గతంలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది, నిలబడింది. అయితే అంతర్గత విషయాల కోసం ఎప్పుడూ ఎటువంటి సహయాన్ని భారత్ ఆర్జించలేదు. అమెరికాలో తుపాకీ హింస జరుగూతనే ఉంది, అనేక మంది మరణిస్తున్నారు. దానిని ఎలా కట్టడి చేయాలో మా నుంచి నేర్చుకోమని మేము అమెరికాకు ఎప్పుడూ చెప్పలేదు. జాత్యహంకారంపై అమెరికా అల్లర్లను ఎదుర్కొంటోంది. మేము వారికి ఉపన్యాసాలు ఇస్తామని వారికి ఎప్పుడూ చెప్పలేదు. బహుశా కొత్త రాయబారి భారతదేశం-అమెరికా సంబంధాల చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం’’ అని కౌంటర్ అటాక్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు