ఈజీగా అంతరిక్షంలోకి వెళ్లి రావొచ్చు.. ఇండియన్స్‌కు యూఎస్ స్పేస్ ఏజెన్సీ ఆఫర్!

రాకేశ్‌శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించే అవకాశం మీకే దక్కొచ్చు. భారతీయుల కోసం అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది సెరా.

Human space flight programme: అంతరిక్షం. ఇదో అంతులేని.. అంతుచిక్కని తెలియని సబ్జెక్ట్. ఎంత తెలుసుకున్నా తక్కువే. శాస్త్రవేత్తలకు కూడా స్పేస్ రీసెర్చ్‌ అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంకా అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉంటాయి. టెక్నికల్‌గా చాలా క్రిటికల్ అయిన స్పేస్ టూర్ అనేది చాలా కష్టం. ఒక దేశ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం సర్వం పెట్టే చేసే ప్రయోగాలే.. అన్ని సమయాల్లో సక్సెస్ కావు. అలాంటిది స్పేస్ టూరిజం అనేది పూర్తిగా ప్రైవేటుపరం కాబోతుంది.? ఎవరంటే వారు ఈజీగా అంతరిక్షంలోకి వెళ్లి రావొచ్చు.? ఫ్లైట్ ఎక్కి ట్రావెల్ చేసినంత సింపుల్‌గా రాకెట్‌లో రయ్‌మని స్పేస్‌లోకి దూసుకెళ్లొచ్చు.

ఆఫర్ లెటర్ మీ ఇంటికి వచ్చినట్లు..
అంతరిక్ష పర్యటన అంటే సహసమే. అయినా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు స్పేస్ ఏంటి.. అక్కడేం ఉంటుంది.. భూమికి మిగతా గ్రహాలకు ఉన్న తేడా ఏంటి..అని ఎంత చదవినా ఓసారి చూసి వస్తే బాగుంటుందనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ కోట్లు పెట్టి వెళ్లలేం. ఫ్రీగా పంపించేందుకు మనమేం శాస్త్రవేత్తలు కాదు. పోనీ ఇస్రోలో పనిచేయడం లేదని అనుకుంటారు నార్మల్ పబ్లిక్. కానీ అంతరిక్ష పర్యటన అవకాశం మీ గడపదొక్కబోతుంది. జాబ్‌కు అప్లై చేస్తే ఆఫర్ లెటర్ మీ ఇంటికి వచ్చినట్లు.. స్పేస్ టూర్‌పై మీ ఇంటికే గుడ్‌న్యూస్ పంపే రోజులు వచ్చేశాయి.

209 రూపాయలతో రిజిస్ట్రేషన్‌ 
కేవలం రూ.209 రూపాయలుంటే చాలు. మీ అంతరిక్ష పర్యటనకు వెళ్లి రావొచ్చు. అదేలా సాధ్యమంటే..చాలా ఈజీ అంటోంది అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ సెరా. కేవలం రూ.209 చెల్లించి పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే.. స్పేస్ టూర్‌కు మీకు టూర్ క్లియర్ అయినట్లే. రాకేశ్‌శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించే అవకాశం మీకే దక్కొచ్చు. భారతీయుల కోసం అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది సెరా.

ఇండియన్స్‌కు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ
ఫ్లైట్ జర్నీనే చాలామందికి లైఫ్‌టైమ్ డ్రీమ్‌గా ఉంటుంది. అలాంటిది స్పేస్ టూర్‌కు అవకాశం దక్కితే ఆ ఫీలింగే వేరు. అంతరిక్షంలో పావుగంట సేపు పర్యటించి వస్తే.. ఊహకందని ఆనందం.. మాటల్లో వర్ణించలేని సంతోషం దక్కుతుంది. అలాంటి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అమెరికాకు చెందిన సెరా సంస్థ ఇండియన్స్‌కు కల్పిస్తోంది. వివిధ దేశాలకు చెందిన ఆరుగుర్ని అంతరిక్షంలోకి పంపాలని డిసైడ్ అయింది సెరా. అందులో భారత్ నుంచి ఒకరు ఉండబోతున్నారు. అమెరికా బిలియనీర్‌ జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్‌ కంపెనీ తయారుచేసిన న్యూషెషర్డ్‌ రాకెట్‌ ద్వారా ఆరుగుర్ని అంతరిక్షంలోకి పంపనున్నది.

భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో..
స్పేస్ టూర్‌కు వెళ్లేందుకు వ్యోమగాముల ఎంపిక మొదలైంది. భారత పౌరసత్వం ఉన్న పౌరులెవ్వరైనా దరఖాస్తు చేసుకోవచ్చుని సెరా తెలిపింది. ఆగస్ట్‌లో రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రూ.209 చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. సెరా ఎంపిక చేసిన ఆరుగురు స్పేస్ టూర్‌కు వెళ్లనున్నారు. వారిని అంతర్జాతీయం అంతరిక్ష సరిహద్దుగా చెప్పే కర్మన్ లైన్ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడవారు 11 నిమిషాలపాటు గడిపేందుకు అవకాశముంటుంది. రాకెట్‌ లాంటి స్పేస్ ఫ్లైట్ ద్వారా వ్యోమగాముల్ని భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతరిక్షంలోకి తీసుకెళ్తారు.

వ్యోమగాముల ఎంపిక ఇలా..
రిజస్ట్రేషన్ అయిపోగానే అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఈజీగా అవకాశం దక్కదు. కోట్లాది మంది భారతీయుల్లో ఒక్కరికి మాత్రమే స్పేస్ టూర్‌కు వెళ్లే అవకాశం దక్కనుంది. ఆ ఒక్కరిని ఎంపిక చేయడం కోసం కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తమ మిషన్ ప్రొఫైల్ పేజీలు, సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్స్‌ వేదికగా.. తాము ఎందుకు స్పేస్‌ టూర్‌కు వెళ్లాలనుకుంటున్నామో ప్రజలకు వివరించాలి. అప్పుడు సోషల్ మీడియా వేదికగా జనం వేసే ఓట్ల ఆధారంగా వ్యోమగాముల ఎంపిక ఉంటుంది.

Also Read: సునీతా విలియమ్స్‌ సేఫేనా.. తిరుగు ప్రయాణం ఎప్పుడు.. స్పేస్ ఎక్స్ సాయం నిజమేనా?

వ్యోమగాముల ఎంపికకు మూడు స్టేజ్‌లల్లో ఫిల్టర్ చేయనుంది సెరా. ఫైనల్‌గా ఇండియా నుంచి ఒకరు అంతరిక్ష పర్యటనకు ఎంపిక కానున్నారు. మొత్తం ఆరుగురికి న్యూషెపర్డ్ స్పేస్ ఫ్లైట్ ద్వారా స్పేస్‌లోకి వెళ్లడానికి ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. మూడ్రోజులు ట్రైనింగ్ తర్వాత.. 11 నిమిషాల పాటు జరిగే అంతరిక్ష పర్యటనకు తీసుకెళ్లనున్నారు.

Also Read: పెళ్లికి వెళితే.. ఒక్కొక్కరికీ 66 వేల రూపాయల క్యాష్ రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు!

ఒక దేశం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం దక్కడం.. అందులో భారత్‌కు చోటు దక్కడం వెరీ ఇంట్రెస్టింగ్. అయితే అవకాశం దక్కే వ్యక్తి.. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్ష పర్యటన చేసిన రెండో భారతీయుడిగా రికార్డు దక్కించుకోనున్నారు. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉన్నా ఆరుగురిని అంతరిక్ష పర్యటనకు పంపాలన్న అమెరికన్ స్పేస్ ఏజెన్సీ సెరా నిర్ణయం టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్‌గా మారింది. అంతర్జాతీయంగా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు