రిషి సునాక్‌కు బిగ్‌షాక్‌.. బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపు.. నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్!

బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కు భంగపాటు ఎదురైంది. యూకే ఎన్నికల ఫలితాల్లో సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాకిచ్చారు.

Britain Election Results 2024 : బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కు భంగపాటు ఎదురైంది. యూకేలో గురువారం రాత్రి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాల వెల్లడి చివరి దశకు చేరుకుంది. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాకిచ్చారు. లేబర్ పార్టీ అఖండ విజయం దిశగా దూసుకెళ్తుంది. దీంతో బ్రిటన్ ను 14ఏళ్లపాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు ఎదురైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.45గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తే.. మొత్తం 650 సీట్లకు గాను 454 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి.

Also Read : Urology Conference : దేశంలోనే అతిపెద్ద యూరాల‌జీ స‌ద‌స్సు.. ఈ నెల 6 నుంచి హైదరాబాద్ వేదికగా ఏఐఎన్‌యూ రెండో ఎడిషన్!

లేబర్ పార్టీ 318 సీట్లు గెలుచుకోగా.. అధికార కన్జర్వేటివ్ పార్టీ 67 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. లిబరల్ డెమోక్రాట్లు 32 సీట్లు, స్కాటిష్ నేషనల్ పార్టీ నాలుగు సీట్లు, రిఫార్మ్ యూకే నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఇంకొన్ని స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. ఆ స్థానాల్లోనూ లేబర్ పార్టీదే హవా సాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాల సరళిని చూస్తే లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఎన్నికల్లో ఓటమిని ప్రధాని రిషి సునాక్ అంగీకరించారు. ఈ ఓటమికి తనే బాధ్యత తీసుకున్నాడు. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను.. విజయం సాధించిన కీర్ స్టార్మర్ కు అభినందనలు అంటూ సునాక్ తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. సర్ కీర్ స్టార్‌మర్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపానని సునాక్ చెప్పారు. నన్ను క్షమించండి.. కన్జర్వేటీవ్ పార్టీ ఓటమికి నేను బాధ్యత వహిస్తాను అని సునాక్ పేర్కొన్నారు.

Also Read : Team India : వాంఖడే స్టేడియంలో కోహ్లీ, రోహిత్ భావోద్వేగ ప్రసంగం.. వారు ఏమన్నారంటే

బ్రిటన్ లో 650 మంది ఎంపీలున్న హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీకి 326 సీట్లు అవసరం. లేబర్ పార్టీ 326 సీట్లు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైంది. కీర్ స్టార్‌మర్‌ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి కానున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఓటమితో ప్రధాని రిషి సునాక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

భారీ విజయంపై కీమ్ స్టార్మర్ స్పందించారు. లేబర్ పార్టీకి లభిస్తున్న మద్దతు చూసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మాకు ఓటు వేయని వారికోసం కూడా పనిచేస్తామని చెప్పారు. ప్రతీరోజూ మీకోసం పనిచేస్తా.. మార్పుకోసం సిద్ధంగా ఉన్నాను. మీ ఓటుతో ఇప్పుడు మార్పు మొదలవుతుందని స్టార్మర్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు