Urology Conference : దేశంలోనే అతిపెద్ద యూరాల‌జీ స‌ద‌స్సు.. ఈ నెల 6 నుంచి హైదరాబాద్ వేదికగా ఏఐఎన్‌యూ రెండో ఎడిషన్!

Urology Conference : దేశంలో యూరాల‌జీ రంగంలో ఈ స‌ద‌స్సు ఒక ప్ర‌ధాన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ నెల 6, 7 తేదీల‌లో జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్ ప్రాంగ‌ణంలో నిర్వహించనున్నారు.

Urology Conference : దేశంలోనే అతిపెద్ద యూరాల‌జీ స‌ద‌స్సు.. ఈ నెల 6 నుంచి హైదరాబాద్ వేదికగా ఏఐఎన్‌యూ రెండో ఎడిషన్!

Prestigious Urology Conference Second Edition ( Image Source : Google )

Urology Conference : ప్రముఖ ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) యూరాల‌జీ, నెఫ్రాల‌జీ సేవలకు పేరుగాంచింది. ఈ ఏఐఎన్‌యూ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క యూరాల‌జీ స‌ద‌స్సు రెండో ఎడిష‌న్ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ఈ సదస్సును యూరేత్రా@ఏఐఎన్‌యూ పేరుతో నిర్వ‌హిస్తున్నారు.

Read Also : Garlic Health Benefits : వెల్లుల్లి తింటే కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే.. మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి!

దేశంలో యూరాల‌జీ రంగంలో ఈ స‌ద‌స్సు ఒక ప్ర‌ధాన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ నెల 6, 7 తేదీల‌లో జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్ ప్రాంగ‌ణంలో నిర్వహించనున్నారు. ఈ స‌ద‌స్సులో మెక్సికో, యూకే, గ‌ల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, బంగ్లాదేశ్‌, నేపాల్, ఆగ్నేయాసియా దేశాల‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాల‌జిస్టులు హాజరు కానున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి యూరోకేర్ ఫౌండేష‌న్ మ‌ల్లిక్ రాజు పూర్ణ స‌హ నిర్వాహ‌కులుగా ఉన్నారు.

మూత్ర‌నాళ పున‌ర్నిర్మాణాల‌పై 24 లైవ్ స‌ర్జ‌రీలు :
దేశంలోనే అతిపెద్ద స‌ద‌స్సుగా పేరొందిన ఇక్కడ యూరాల‌జిస్టుల కోసం 24 లైవ్ స‌ర్జ‌రీలను ప్ర‌ద‌ర్శిస్తారు. మూత్ర‌నాళ పున‌ర్నిర్మాణాల‌లో కొత్త టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ఈ ఆపరేషన్లలో సంక్లిష్టమైన అంశాలతో పాటు మూత్ర‌నాళం స‌న్న‌బ‌డితే పిల్ల‌లు, పురుషులు, మ‌హిళ‌ల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూడవచ్చు.

అదేవిధంగా, జ‌న్యుప‌ర‌మైన ఇంజినీరింగ్ చేసిన సామాగ్రితో రీజ‌న‌రేటివ్ మెడిసిన్‌లో సెల్ థెర‌పీ వంటి అత్యాధునిక ప‌ద్ధ‌తులను కూడా తెలుసుకోవచ్చు. పుణె డాక్ట‌ర్ సంజ‌య్ కుల‌క‌ర్ణి, కోయంబ‌త్తూరు డాక్ట‌ర్ గ‌ణేశ్ గోపాల‌కృష్ణ‌న్ యూరాల‌జీ దిగ్గ‌జాలు సహాహైద‌రాబాద్ ఐఎస్‌బీ మాజీ డీన్ అజిత్ రంగ్నేక‌ర్ కూడా ఈ స‌ద‌స్సులో అనేక కీలక అంశాలపై మాట్లాడారు.

ఏఐఎన్‌యూ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు, ఆండ్రాల‌జిస్టు డాక్ట‌ర్ ఎన్‌గంటి భ‌వ‌తేజ్ మాట్లాడుతూ.. “మూత్ర‌నాళ పున‌ర్నిర్మాణ శ‌స్త్రచికిత్స‌లు చాలా సంక్లిష్టంగా ఉంటాయన్నారు. ఈ ఆపరేషన్లు ఫెయిల్ కూడా ఎక్కువే. ట్రైనింగ్, నైపుణ్యం కలిగిన యూరాల‌జిస్టుల అవ‌స‌రం ఎక్కువ‌. విజ్ఞానం పంచ‌డం, రోగుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డమే యూరాల‌జిస్టుల స‌ద‌స్సు ప్ర‌ధాన ల‌క్ష్యం” అని ఆయన వివ‌రించారు. 4కె ప్రొజెక్ష‌న్ టెక్నాల‌జీ ద్వారా అత్యాధునిక లైవ్ స్ట్రీమింగ్ ప్రొగ్రామ్ ఉంటుంది. మూత్ర‌నాళ శ‌స్త్రచికిత్స‌లు ఎలా చేస్తున్నార‌నేది దీని ద్వారా స్ప‌ష్టంగా వివ‌రంగా తెలుసుకోవచ్చు.

ఏఐఎన్‌యూ :
భారత్‌లో యూరాల‌జీ, నెఫ్రాల‌జీ ఆస్పత్రుల నెట్‌వ‌ర్కులో ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ ఎంతో ముఖ్యమైనది. కొద్దిరోజుల క్రితమే ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ టేకోవ‌ర్ చేసింది. ప్ర‌ముఖ యూరాల‌జిస్టుల‌ు, నెఫ్రాల‌జిస్టులతో కూడిన ఏడు ఆస్పత్రులు దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు న‌గ‌రాల్లో ఉన్నాయి. నెఫ్రాల‌జీ, యూరాల‌జీ రంగాల‌లో చికిత్సాప‌ర‌మైన నైపుణ్యాల‌తో అనేక వైద్యపరమైన చికిత్సలను అందిస్తోంది.

ఈ ఆస్ప‌త్రిలో రీక‌న్‌స్ట్ర‌క్టివ్ యూరాల‌జీ, యూరో-ఆంకాల‌జీ, మ‌మిళ‌ల యూరాల‌జీ, పిల్ల‌ల యూరాల‌జీ, ఆండ్రాల‌జీ, డ‌యాల‌సిస్, మూత్ర‌పిండాల మార్పిడి వంటి అనేక సేవ‌లను అందిస్తోంది. యూరాల‌జీ, యూరో-ఆంకాల‌జీ, నెఫ్రాల‌జీ రంగాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 12వందల రోబోటిక్ స‌ర్జ‌రీలు చేయడంతో పాటు రోబోటిక్ యూరాల‌జీ రంగంలో దేశంలోనే ముందంజ‌లో నిలిచింది. దేశంలో ఈ ఆస్ప‌త్రికి 500 ప‌డ‌క‌లు కూడా ఉన్నాయి. ఇప్పటివ‌ర‌కు ల‌క్ష మందికి పైగా రోగుల‌కు చికిత్స‌ అందుకున్నారు.

Read Also : Health Insurance: హెల్త్ ఇన్సురెన్స్ నగదు రహిత చికిత్సలపై ఇకపై గంటలోపే నిర్ణయం.. అంతేకాదు..