Team India : వాంఖడే స్టేడియంలో కోహ్లీ, రోహిత్ భావోద్వేగ ప్రసంగం.. వారు ఏమన్నారంటే

రోహిత్ శర్మ, నేను గత 15 సంవత్సరాలుగా కలిసి ఆడుతున్నాం. రోహిత్ ఇంత ఉద్వేగానికి లోనవడం నేను ఇదే మొదటిసారి చూశా.

Team India : వాంఖడే స్టేడియంలో కోహ్లీ, రోహిత్ భావోద్వేగ ప్రసంగం.. వారు ఏమన్నారంటే

Virat kohli and Rohit Sharma

Team India Victory Parade : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో విజయం తరువాత క‌రేబియ‌న్ దీవుల నుంచి స్వ‌దేశానికి చేరుకున్న భారత్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ముంబయిలోని మెరైన్ డ్రైవ్ లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం వాంఖ‌డే స్టేడియంలో భార‌త ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ స‌న్మానించింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియం కోహ్లీ, రోహిత్ నామస్మరణతో మారుమోగిపోయింది.

Also Read : Team India : భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్.. అభిమానుల‌తో పోటెత్తిన ముంబై తీరం

రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ ట్రోపీ దేశ ప్రజలందరిది. ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలవడం చాలా సంతోషంగా ఉంది. క్రీడల పట్ల ఆయనకు చాలా గౌరవం, ఉత్సాహం ఉందని రోహిత్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ పట్టిన క్యాచ్ గురించి మాట్లాడారు. మ్యాచ్ చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని డేవిడ్ మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. ఆ సమయంలో స్టేడియంలో గాలి బలంగా వీస్తుంది. దీంతో అది కచ్చితంగా సిక్సర్ అవుతుందని అనుకున్నా. కానీ, విధి మరో విధంగా రాసింది. చివర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అపురూపంగా మారింది. ఈ టీంకు కెప్టెన్ గా ఉండటాన్ని నేను గర్వపడుతున్నాను అంటూ రోహిత్ అన్నారు.

Also Read : Hardik Pandya : రెండు నెల‌ల ముందు జీరో.. ఇప్పుడు హీరో.. ద‌టీజ్ హార్దిక్ పాండ్యా..

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, నేను చాలాకాలంగా ఈ ఫీట్ సాధించాలని ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ కప్ గెలవాలన్నదే మా కల. మేము గత 15 సంవత్సరాలుగా కలిసి ఆడుతున్నాం. రోహిత్ ఇంత ఉద్వేగానికి లోనవడం నేను ఇదే మొదటిసారి చూశా. రోహిత్ ఏడుస్తున్నాడు, నేను ఏడ్చేశా. మేమిద్దరం ఒకరినొకరు కౌగిలించుకున్నాం. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం. జస్ర్పీత్ బుమ్రా వంటి బౌలర్లు చాలా అరుదు. అతను ప్రపంచంలోనే ఎనిమిదో అద్భుతం అని కోహ్లీ అన్నారు. అనంతరం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఈరోజు వీధుల్లో చూసిన దృశ్యం నేను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.