Team India : భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్.. అభిమానులతో పోటెత్తిన ముంబై తీరం
కరేబియన్ దీవుల నుంచి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది.

Team India Victory Parade in Mumbai
టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత జట్టు నిలిచింది. కరేబియన్ దీవుల నుంచి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భారత జట్టు ఆటగాళ్లు భేటీ అయ్యారు.
అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముంబై వీధుల్లో ఓపెన్ టాప్ బస్‌లో ప్రపంచకప్‌తో టీమ్ఇండియా రోడ్ షో చేయనుంది.
ఈ క్రమంలో ముంబై తీరం మొత్తం అభిమానులతో పోటెత్తింది. ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. రోడ్ షో అనంతరం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది.