కొంపముంచిన హామీలు, అనాలోచిత నిర్ణయాలు.. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ ఘోర ఓటమి

కష్ట కాలంలో బాధ్యతలు చేపట్టి సునాక్.. చరిత్ర సృష్టించి, ఎన్నో అవాంతరాలు దాటి ఫైనల్ గా రాజకీయ భవిత్యవాన్ని తేల్చే ఎన్నికల్లో ఓడిపోయారు రిషి సునాక్.

Uk Election Results 2024 : అధికారం ఇచ్చే కిక్కే వేరు. పవర్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ తమకు తిరుగులేదని అనుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ ను కూడా కుంభకోణాలు, హామీలు, అంచనాలు తలకిందులు చేశాయి. పాలనలో వైఫల్యం నిండా ముంచింది. చివరకు లేబర్ పార్టీ ప్రభంజనంలో రిషి సునాక్ టీమ్ కి ఓటమి మిగిలింది. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు ఎండ్ కార్డ్ పడింది. కష్ట కాలంలో బాధ్యతలు చేపట్టి సునాక్.. చరిత్ర సృష్టించి, ఎన్నో అవాంతరాలు దాటి ఫైనల్ గా రాజకీయ భవిత్యవాన్ని తేల్చే ఎన్నికల్లో ఓడిపోయారు రిషి సునాక్. ఇంతకీ కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి? ఆ పార్టీ అంచనాలు తప్పడానికి రీజన్ ఏంటి?

గెలుపంటే మామూలు గెలుపు కాదు. చరిత్రలో నిలిచిపోయే విజయం. ప్రత్యర్థే మెచ్చుకునేంత గొప్ప విక్టరీ. చివరకు అతడిని విజయతీరాలకు చేర్చింది. శత్రువు బలం ముందు మనం ఎప్పుడూ బలహీనంగా ఉంటాం. అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు. కానీ, గెలవాలనే పట్టుదల, ప్రత్యర్థిని ఓడించాలనే తపన అతడిని గెలుపు గుర్రాన్ని చేసింది. బ్రిటన్ ప్రధాని కాబోతున్న లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్.. అప్రతిహత పాలన గద్దె దించి ఏకంగా 14ఏళ్ల తర్వాత లేబర్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించారు. అసలు ఎవరీ స్టార్మర్? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారు? బ్రిటన్ లో బలమైన పునాదులు ఉన్న కన్జర్వేటివ్ పార్టీని ఓడించడంలో ఆయన కష్టమెంత?

Also Read : సమంత పోస్ట్‌పై డాక్టర్ల రియాక్షన్‌ ఎలా ఉన్నా.. గూగుల్‌లో సెర్చ్‌ చేసి సొంత వైద్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు