Advice from Harsh Goenka : మీరు మంచి పని చేస్తున్నారా? దయచేసి దానిని కెమెరాలో బంధించకండి.. ఈ సలహా ఇచ్చిందెవరంటే?

మనం ఏ మంచి పని చేసినా దానిని ఫోటోలు తీసి పదిమందికి చూపించకూడదట.. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయేంకా చెబుతున్నారు. ఓ ట్విట్టర్ యూజర్‌కి ఆయన ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advice from Harsh Goenka

Advice from Harsh Goenka :  మంచి ఉంటే మైకులో చెప్పండి.. చెడు చెవిలో చెప్పండి అని ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట చాలా వైరల్ అయ్యింది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే న్యూస్‌కి ఇది క్వైట్ అపోజిట్‌లో వర్తిస్తుంది. చేసే మంచి పనిని బయటకు చెప్పొద్దని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గొయేంకా ఓ ట్విట్టర్ యూజర్‌కి సలహా ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

MRI scanner : పిల్లల కోసం సరికొత్త MRI స్కానర్ .. నిజంగా వారి భయాన్ని పోగొడుతుందా?

మంచి చేస్తే చెడు ఎదురైంది అంటారు. పవన్ కౌశిక్ అనే ట్విట్టర్ యూజర్‌కు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయట. రీసెంట్‌గా అతను రోడ్ సైడ్ బఠానీలు అమ్ముతున్న ఓ మహిళ దగ్గర ఉన్న మొత్తం సరుకును కొనుగోలు చేశాడట. ఆ తరువాత ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పాడట. ఇక తాను బఠానీలు కొంటూ ఆ మహిళ పక్కన నిలబడ్డ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని కొందరు పొగుడుతున్నారని.. కొందరు విమర్శిస్తున్నారని ఎందుకిలా జరుగుతోందంటూ వ్యాపారవేత్త హర్ష్ గోయేంకాకు తన పోస్ట్ ట్యాగ్ చేశాడు.

Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్

దీనిపై హర్ష్ గోయేంకా స్పందించారు. ‘మీరు ఎప్పుడు మంచి చేసినా దానిని కెమెరాలో బంధించకండంటూ’ సలహా ఇచ్చారు. దానికి పవన్ మళ్లీ ‘తాను ఓ చిన్న సాయం అందించాను.. నేను చేసిన పని కొందరిని అయినా ఇన్ స్పైర్ చేస్తుందేమో అన్నది నా ఆలోచన’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి కాన్వర్సేషన్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ‘మీరు ఈ విషయాన్ని హర్ష్ గోయేంకాకు ట్యాగ్ చేయడం ద్వారా ఫేమస్ అవ్వాలనుకుంటున్నారా? అని కొందరు.. ఆ మహిళకు సాయం చేసి ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హక్కు మీకు లేదు.. మీది చాలా చీప్ పబ్లిసిటీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘కుడి చేయి ఏమి ఇచ్చిందో ఎడమ చేతికి కూడా తెలియకూడదు’ అంటారు. పాపం పవన్ తాను చేసింది మంచి పనే అయినా ఇలా నెటిజన్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు