Rajamouli – RGV : రాజమౌళిని ఓ రేంజ్‌లో పొగిడిన ఆర్జీవీ.. బాహుబలి కథ నాకు చెప్పాడు.. ఈ సక్సెస్ తెలుగు సినిమాది కాదు..

తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు.

RGV Praised Rajamouli in Bollywood Media RGV Comments goes Viral

Rajamouli – RGV : రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడు అని మన అందరికి తెలిసిందే. తన సినిమాలతో రాజమౌళి సాధించిన విజయాల గురించి అంతా మాట్లాడుకుంటారు. హాలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్స్ సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. RRR తో ఆస్కార్ సాధించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా రాజమౌళి గురించి ఆర్జీవీ గొప్పగా మాట్లాడాడు. ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఆర్జీవీ ఇప్పుడు తనకు నచ్చినట్టు సినిమాలు చేస్తానని ప్రయోగాలు చేస్తున్నాడు. ఆర్జీవీ అంత సాధారణంగా ఎవర్ని పొగడడు. గతంలో కూడా రాజమౌళిని పొగుడుతూ ఆర్జీవీ మాట్లాడారు. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు.

Also Read : Harish Shankar : ఇదే మీ లాస్ట్ రీమేక్ కావాలి అన్న నెటిజ‌న్‌.. ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ సమాధానం అదుర్స్‌..

ఆర్జీవీ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. నాకు బాహుబలి సినిమా రిలీజ్ ముందు వాళ్ళ ఇంటి బాల్కనీలో బాహుబలి కథ చెప్పాడు. సినిమా రిలీజ్ కి ముందు నాతో ఒక ప్రొడ్యూసర్ సినిమా ఫ్లాప్ అవుతుంది, చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేసారు అని అన్నాడు. రాజమౌళి అందరికంటే డిఫరెంట్. మగధీరతో అతన్ని అందరూ గుర్తించారు. ఈగ, బాహుబలితో కొత్తగా ట్రై చేసాడు. బాహుబలిలో ప్రతి ఫ్రేమ్ కి బాగా ఖర్చుపెట్టాడు. బాహుబలి కలెక్షన్స్ ని బాలీవుడ్ సినిమాలు కూడా కలెక్ట్ చేయలేవు. రాజమౌళి సక్సెస్ తెలుగు సినిమాది కాదు. ఇది కేవలం రాజమౌళిదే. రాజమౌళి ఎక్కడ పుట్టినా ఇలాగే సినిమాలు తీసేవాడేమో. RRRలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా యూనిక్ గా ఉంటాయి. RRR వల్లే ఇండియన్ సినిమా గురించి చాలా దేశాలకి తెలిసింది. ఇప్పుడు రాజమౌళి తీయబోయే సినిమా మన ఊహలకు కూడా అందదు. అన్ని సినిమాలని మించి ఉంటుంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాజమౌళి గొప్పగా చెప్పుకోడు. సినిమా రిజల్ట్ పై అతనికి భయం ఉంటుంది. నిర్మాతలు పెట్టే డబ్బుకి న్యాయం చేయాలనే భయం ఉంటుంది. రాజమౌళి వేరే డైరెక్టర్స్ కి గేట్స్ ఓపెన్ చేసాడు. కొత్తగా ట్రై చేయడానికి కొత్త దర్శకులకు ఒక ఉదాహరణగా నిలిచాడు. రాజమౌళి ఎంత సాధించినా చాలా సింపుల్ లైఫ్ బతుకుతాడు. రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్ అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేసాడు. దీంతో ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు