Priyanka Gandhi: మోదీకి ప్రియాంక గాంధీ.. లఖిమ్‌పూర్ వీడియో చూపిస్తూ సూటి ప్రశ్న

"నరేంద్ర మోదీజీ మీ ప్రభుత్వం ఎటువంటి ఆర్డర్ లేదా ఎఫ్ఐఆర్ లేకుండా నన్ను గత 28గంటలుగా నిర్బంధంలో ఉంచారు. అన్నదాతలను హింసించిన వ్యక్తిపై మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదెందుకు"

Priyanka Gandhi: ‘నరేంద్ర మోదీజీ మీ ప్రభుత్వం ఎటువంటి ఆర్డర్ లేదా ఎఫ్ఐఆర్ లేకుండా నన్ను గత 28గంటలుగా నిర్బంధంలో ఉంచారు. అన్నదాతలను హింసించిన వ్యక్తిపై మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదెందుకు’ అంటూ వీడియో పోస్టు చేశారు కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ. సోమవారం ఉదయం సమయంలో లఖిమ్‌పూర్ వెళ్తున్న సోనియాగాంధీని అడ్డుకున్న పోలీసులు ఆమెను సీతాపూర్‌లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు.

నేరానికి పాల్పడిన కేంద్ర మంత్రి కొడుకుని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రశ్నించారు ప్రియాంక. అజాదీ అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో పాల్గనేందుకు ప్రధాని మోదీ లక్నోకు రానున్నారు. స్వేచ్ఛ వేడుకలను జరుపుకునేందుకు ప్రధాని వస్తున్నారని.. మనకు స్వేచ్ఛను కల్పించేవారెవరని ప్రియాంక ప్రశ్నించారు.

ఒక వీడియోను రికార్డ్ చేసి అందులో పలు ప్రశ్నలు అడిగారు. మంత్రి కొడుకుని అరెస్ట్‌ చేయకుండా మంత్రిని తొలగించకుండా లక్నోలో స్వేచ్ఛ వేడుకలను జరుపుకునేందుకు ఎలాంటి నైతిక అధికారం ఉంది. ఈ మంత్రి కొనసాగితే.. కేంద్రంలో ప్రభుత్వం కొనసాగే నైతిక అధికారం కోల్పోయినట్లేనని విమర్శించారు. అదే వీడియోలో ప్రియాంక ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.

…………………………………………: మంచు విష్ణుపై “మా” అధికారికి ఫిర్యాదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్!

ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలంటూ పేర్కొన్నారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని అన్నదాతలు నిరసన చేస్తుండగా వాహనం వేగంగా దూసుకురావడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మిర్జాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత లలితేశ్ పాటి త్రిపాఠి ఈ వీడియోను పోస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు