నల్ల రంగులో జిలేబీలు.. అలా ఎలా చేస్తారంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Viral Video: సాధారణంగా జిలేబీలు ఆరెంజ్, ఎల్లో కలర్స్ లో ఉంటాయి. అయితే, నల్ల రంగు జిలేబీని ఎప్పుడైనా చూశారా?

Black Jalebi

తీపి ఆహార పదార్థాలు తినాలంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమే. గులాబ్ జామ్ నుంచి జిలేబీ, హల్వా వరకు మన దగ్గర ఎన్నో ఆహార పదార్థాలను అమ్ముతుంటారు, ఇళ్లలో చేసుకుంటారు.

జిలేబీలను చాలా మంది మరీ ఇష్టంగా తింటుంటారు. వాటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. సాధారణంగా జిలేబీలు ఆరెంజ్, ఎల్లో కలర్స్ లో ఉంటాయి. అయితే, నల్ల రంగు జిలేబీని ఎప్పుడైనా చూశారా? ఓ ప్రాంతంలో నల్ల రంగులో జిలేబీలను తయారు చేశారు. ప్రతిరోజు ఆరెంజ్, ఎల్లో కలర్స్ లో చూసే జిలేబీలను ఒక్కసారిగా నలుపు రంగులో చూడడంతో ఈ కలర్ నెటిజన్లకు నచ్చడం లేదు.

ఈ నల్ల జిలేబీలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిలేబీ అంటే నల్లగా ఎందుకు ఉండకూడదని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. నల్ల జిలేబీలను తాము తినబోమని, ఎప్పటిలాగే ఆరెంజ్, ఎల్లో కలర్ లో ఉంటేనే తింటామని కొందరు కామెంట్లు చేశారు. ఈ జిలేబీలను ఎక్కడ తయారు చేస్తున్నారో కానీ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి అవి.

బీచ్‌లో చెప్పులు లేకుండా యువకుడు వాకింగ్.. మాంసాన్ని తినే బాక్టీరియా సోకి..