Delhi Liquor Case: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కొన్ని వారాలుగా జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Kejriwal Bail: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు 21 రోజుల షరతులతో కూడిన బెయిల్ దక్కింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కొన్ని వారాలుగా జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జూన్ 2న మళ్లీ లొంగిపోవాలని చెప్పింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఇటీవల అటు రౌస్ అవెన్యూ కోర్టులోనూ.. ఇటు సుప్రీంకోర్టులోనూ రిలీఫ్ లభించలేదన్న విషయం తెలిసిందే. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో, మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు కేజ్రీవాల్. ఈడీ, కేజ్రీవాల్ తరఫు లాయర్ల వాదనలు విన్న కోర్టు.. బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెల్లడించింది.

కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఇది అసాధారణ పరిస్థితి అని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని.. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని జడ్జి కామెంట్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి.. ఆప్ అధినేతగా కేజ్రీవాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు జడ్జి.

బెయిల్ షరతులు:
ఢిల్లీ లిక్కర్ కేసులో తన పాత్ర గురించి బయట మాట్లాడకూడదు
ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షుల తో మాట్లాడకూడదు
ఢిల్లీ లిక్కర్ కేసు అధికారిక ఫైల్స్ చూడకూడదు
ఎలాంటి అధికారిక పత్రాలపై సంతకాలు చేయకూడదు
సీఎం ఆఫీస్ కు, సెక్రటేరియట్ కు వెళ్లకూడదు
50వేల షూరిటీ బాండ్, ఒకరి పూచికత్తు సమర్పించాలి

Also Read: టీడీపీ నేతలు మనుషులా, రాక్షసులా ..? అప్పుడు అసెంబ్లీలో ఎందుకు మద్దతు ఇచ్చారు : సజ్జల రామకృష్ణారెడ్డి

ట్రెండింగ్ వార్తలు