Neha Dhupiya : మగబిడ్డకు జన్మనిచ్చిన బాలకృష్ణ హీరోయిన్

ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ నేహా ధూపియా ఇవాళ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేహా భర్త, నటుడు అంగద్‌ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు.

Neha Dhupiya :  ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ నేహా ధూపియా ఇవాళ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేహా భర్త, నటుడు అంగద్‌ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని, త్వరలో బేబీకి పేరు పెట్టి మీకు చెప్తామని, ఈ ప్రయాణంలో నేహా కి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను తాను ఒక యోధురాలిగా పోరాడింది, ఈ జ్ఞాపకాలు మాతో ఎప్పుడూ ఉంటాయి అని పోస్ట్ చేసాడు. అయితే కొడుకు ఫొటోను మాత్రం రివీల్‌ చేయలేదు.

Chay Sam Breakup : చై-సామ్ విడాకుల గురించి ముందే చెప్పిన జ్యోతిష్కుడు.. అఖిల్ గురించి కూడా??

ఇది ఆమెకు రెండో సంతానం. అంతకు ముందు 2018లో ఈ దంపతులకి ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు మరో బాబు పుట్టాడు. ఈ విషయం తెలియచేయడంతో నేహాకు ఆమె అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేహా ‘మిన్నారం’ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి 2000 సంవత్సరంలో ‘ఖయామత్‌: సిటీ అండర్‌ త్రెట్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. 2018 మేలో నటుడు, మోడల్‌ అంగద్‌ బేడీని పెళ్లి చేసుకుంది. నేహా తెలుగులో తరుణ్ నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. రాజశేఖర్ తో ‘విలన్’ సినిమాలో నటించింది. ‘పరమ వీర చక్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

ట్రెండింగ్ వార్తలు