Tamilnadu CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కోపమొచ్చింది.. వారికి స్ట్రాంగ్​ వార్నింగ్​

తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉండే స్టాలిన్ తాజాగా ఆగ్రహంతో ఊగిపోయారు.

Tamilnadu CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉండే స్టాలిన్ తాజాగా ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు గీతదాటితే నేను నియంతలా మారుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఎవరికోకాదు..  డీఎంకే నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు.

CM Stalin: తెలుగు యువకుడి కోసం కాన్వాయ్ ఆపిన సీఎం స్టాలిన్

డీఎంకే పార్టీ ప్రజాప్రతినిధులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను భర్తలకు అప్పజెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని స్టాలిన్ సూచించారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, చట్టానికి కట్టుబడి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తాను నియంతలా మారి కఠిన చర్యలు తీసుకుంటానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో డీఎంకే అంత తేలిగ్గా అధికారంలోకి రాలేదని, కోట్లాది మంది పార్టీ కార్యకర్తలు నిస్వార్థం కృషి ఫలితంగానే అధికారంలోకి వచ్చామంటూ స్టాలిన్ చెప్పారు. నేనుకూడా గత ఐదు దశాబ్దాలుగా చేసిన కృషితోనే ముఖ్యమంత్రిని అయ్యానని గుర్తు చేశారు.

దటీజ్ CM Stalin.. నరికురవ మహిళను కలిసి, కోట్ల విలువైన సంక్షేమ పథకాల ప్రకటన

ప్రజల మన్ననలు పొందడం కష్టసాధ్యమని, గత 50ఏళ్లుగా నేను ప్రజల మధ్యే పనిచేస్తున్నానని స్టాలిన్ తెలిపారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని పనిచేసినప్పుడే వారు అండగా నిలుస్తారని చెప్పారు. అదే సమయంలో ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే సామాన్య ప్రజలు బహిష్కరిస్తారనే విషయం మర్చిపోవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆరోపణలు ఉండకూడదని స్టాలిన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు