India vs West Indies : 1000వ మ్యాచ్.. భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు తొలి వన్డే జరుగనుండగా...

Historic 1000th ODI For India : భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం తొలి వన్డే ఆడిన టీమిండియా.. ఇవాళ వెస్టిండీస్‌తో తమ 1,000వ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. చారిత్రక సందర్భాన్ని విజయంతో గుర్తుండిపోయేలా మార్చుకోవాలనుకుంటున్న రోహిత్‌ సేన అందుకోసం అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది. భారత క్రికెట్‌లో ఎన్నో మరపురాని మైలురాళ్లకు సాక్షిగా నిలిచిన మొతెరా స్టేడియం.. ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. సఫారీ టూర్‌లో పేలవ ప్రదర్శన.. కెప్టెన్సీ విషయంలో గందరగోళం.. కరోనా విజృంభణ.. ఇలా నెలరోజులుగా అనేక అవరోధాలను ఎదుర్కొన్న టీమిండియా.. గ్రౌండ్‌లో తమ ప్రదర్శనతో వాటిన్నింటిని పక్కన పెట్టి అందరి దృష్టిని ఆటపైకి తేవాలని భావిస్తోంది.

Read More : UP Elections 2022: ఉద్యోగం, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి – ప్రియాంక గాంధీ

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు తొలి వన్డే జరుగనుండగా.. 2023 వన్డే ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలనుకుంటున్న కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. మిడిలార్డర్‌పై దృష్టి పెట్టడంలో నిమగ్నమయ్యాడు. రోహిత్‌-ద్రవిడ్‌ జోడీకి స్వదేశంలో ఇదే తొలి పరీక్ష . ఇక మూడు ఫార్మాట్లలో సారథ్యానికి వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లీ ఆకలిగొన్న సింహంలా పరుగుల వేట ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకొని మంచి జోష్‌లో ఉన్న వెస్టిండీస్‌.. అదే జోరులో టీమిండియాకు ఝలక్‌ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

Read More : Rahul Ramakrishna: తూచ్ నేను జోక్ చేశా.. అందరినీ ఫూల్స్ చేసిన రాహుల్!

భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డేల మ్యాచ్ ల సిరీస్ ఫిబ్రవరి 06వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయి. భారత్ తర్వాత 958 మ్యాచ్ లతో ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ లో ఉండగా, పాక్ 936 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ 999 వన్డేలు ఆడింది. అందులో 518 మ్యాచ్ లో విజయం సాధించగా..431 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.

ట్రెండింగ్ వార్తలు