IPL 2023: ఆర్సీబీపై గుజరాత్ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయ్యాయి.
ఆర్సీబీపై గుజరాత్ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయ్యాయి. లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
15వ ఓవర్‌ను విజయ్‌కుమార్ వైశాక్ వేయగా నాలుగో బంతికి సిక్స్ కొట్టిన విజయ్ శంకర్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికి మరో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద కోహ్లీ చేతికి చిక్కాడు శంకర్(53). దీంతో 148 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు గుజరాత్ స్కోరు 148/2. శుభ్‌మన్ గిల్(71), దాసున్ షనక(0) క్రీజులో ఉన్నారు.
12వ ఓవర్‌ను హర్షల్ పటేల్ వేయగా రెండో బంతికి సింగిల్ తీసి 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేశాడు శుభ్‌మన్ గిల్
లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు షాక్ తగిలింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పార్నెల్ క్యాచ్ అందుకోవడంతో వృద్ధిమాన్ సాహా(12) ఔట్ అయ్యాడు. దీంతో 25 పరుగుల వద్ద గుజరాత్ మొదటి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లకు గుజరాత్ స్కోరు 25/1. శుభ్‌మన్ గిల్(8), విజయ్ శంకర్(0)లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. విరాట్ కోహ్లి(101 నాటౌట్; 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 60 బంతుల్లో విరాట్ శతకం బాదాడు. ఐపీఎల్లో విరాట్‌కు ఇది ఏడో శతకం కాగా.. ఈ సీజన్లో వరుసగా రెండోది. మిగిలిన వారిలో డుప్లెసిస్(28), మైఖేల్ బ్రేస్‌వెల్(26) పర్వాలేదనిపించగా ఆఖర్లో అనుజ్ రావత్(23 నాటౌట్; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
విరాట్ కోహ్లి సెంచరీ చేశాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో(19.1వ ఓవర్) సింగిల్ తీసి 60 బంతుల్లో శతకం బాదాడు. ఇందులో 13 పోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఐపీఎల్లో విరాట్‌కు ఇది ఏడో శతకం కాగా ఈ సీజన్లో వరుసగా రెండోది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విరాట్ సెంచరీ బాదాడు.
యశ్ దయాల్ బౌలింగ్‌లో వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవడంతో దినేశ్ కార్తిక్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో 133 పరుగుల(14.2వ ఓవర్) వద్ద బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది.
బెంగళూరు మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో మైఖేల్ బ్రేస్‌వెల్(26) ఔట్ అయ్యాడు. దీంతో 132 పరుగుల వద్ద బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు బెంగళూరు స్కోరు 132/4. విరాట్ కోహ్లి(60), దినేశ్ కార్తిక్(0) క్రీజులో ఉన్నారు.
12వ ఓవర్‌ను నూర్ అహ్మద్ వేయగా ఐదో బంతికి రెండు పరుగులు తీసి కోహ్లి 35 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్లో విరాట్‌కు ఇది 51వ హాఫ్ సెంచరీ. 12 ఓవర్లకు బెంగళూరు స్కోరు 112/3. విరాట్ కోహ్లి(52), మైఖేల్ బ్రేస్‌వెల్(15) క్రీజులో ఉన్నారు.
బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోతుంది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో మహిపాల్ లోమ్రోర్(1) స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ 85 పరుగుల(9.1వ ఓవర్) వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు బెంగళూరు స్కోరు 93/3. విరాట్ కోహ్లి(48), మైఖేల్ బ్రేస్‌వెల్(1) క్రీజులో ఉన్నారు.
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాక్స్వెల్(11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 80 పరుగుల(8.2వ ఓవర్) వద్ద బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. 9 ఓవర్లకు బెంగళూరు స్కోరు 82/2. విరాట్ కోహ్లి(41), మహిపాల్ లోమ్రోర్(1) క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న డుప్లెసిస్(28) ఔట్ అయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్ తెవాలియా క్యాచ్ అందుకున్నాడు. దీంతో 67 పరుగుల(7.1వ ఓవర్) వద్ద బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు బెంగళూరు స్కోరు 79/1. విరాట్ కోహ్లి(39), గ్లెన్ మాక్స్ వెల్(11) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది ఆర్సీబీ. ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ వచ్చారు. మొదటి ఓవర్ నుంచే వీరిద్దరు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసే సరికి బెంగళూరు స్కోరు 62/0. విరాట్ కోహ్లి(36), డుప్లెసిస్(22) క్రీజులో ఉన్నారు
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
ఐపీఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేశారు. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.