Delhi : జహంగీర్‌‌పూర్‌‌లో మరోసారి టెన్షన్.. పోలీసులపైకి రాళ్లు

దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మహిళా ఇంటికి పోలీసులు చేరుకోవడం..వారిని అడ్డుకుంటూ...

Jahangirpuri Violence : దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మహిళా ఇంటికి పోలీసులు చేరుకోవడం..వారిని అడ్డుకుంటూ.. రాళ్లు విసరడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాక 23 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీన హింసాకాండలో నీలి రంగు కుర్తా ధరించిన వ్యక్తి కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి CD పార్క్ రోడ్ లోని అతని ఇంటికి వెళ్లింది. దీనిని కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. వారిపై రాళ్లు రువ్వారు. తాజాగా జరిగిన రాళ్ల దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ Usha Rangnani వెల్లడించారు. చట్టపరమైన చర్యలు తీసుకొనడం జరుగుతుందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు వెల్లడించారు. మహిళా బంధువులను అదుపులోకి తీసుకున్న తర్వాత.. నిరసనకారులు దర్యాప్తు బృందంపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు.

Read More : Jahangirpuri violence : జహంగీర్‌పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్‌లో కోర్టుకు నిందితుడు..

జహంగీర్ పురి ప్రాంతంలతో హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపులో హింసాకాండ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ అస్థానా వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ.. ఇతర వాటిని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కొంతమంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని..వీటిని నిశితంగా పరిశీలించడం జరుగుతోందన్నారు. తప్పుడు సమాచారం షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని..పుకార్లను ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఢిల్లీలోని జహంగీర్ పురిలోని మసీదులోకి వెళ్లింది. హింస వెనుక ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న అన్సార్ (35) మొబైల్ రిపేరింగ్ షాపులో పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అన్సార్ ను ఒకరోజు పోలీసు కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తన భర్త అమాయకుడని, హింసకు పాల్పడలేదని అతని భార్య విలేకరులకు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు