Jio Airtel Vi Offers : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ కస్టమర్ల వివిధ అవసరాలను తీర్చడానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. సరసమైన రీఛార్జ్‌ల నుంచి వార్షిక ప్లాన్లు లేదా OTT బెనిఫిట్స్ కూడా అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఒక ఆప్షన్ ఉంది. మూడు టెలికాం ఆపరేటర్ల వినియోగదారులలో అత్యంత పాపులర్ పొందిన రీఛార్జ్ ప్లాన్లలో ఒకటి 84 రోజుల వ్యాలిడిటీ ప్యాక్.
నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయినవారికి ఇదో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కానీ, వార్షిక రీఛార్జ్ ప్లాన్లను ఇష్టపడని వినియోగదారుల కోసం ఈ కొత్త 84-రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రూపొందించాయి. దాదాపు అర్ధ ఏడాది పాటు వ్యాలిడిటీని అందిస్తాయి. Jio, Airtel, Vi కాలింగ్, డేటా, SMS, అదనపు బెనిఫిట్స్ కోసం 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను అందిస్తాయి. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా అందించిన అందుబాటులో ఉన్న 84-రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను ఓసారి చూద్దాం..
జియో రూ. 666 ప్లాన్ : ఈ ప్లాన్ 1.5GB రోజువారీ క్యాప్‌తో మొత్తం 126GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు అన్లిమిటెడ్ కాల్లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity, (JioCloud)తో సహా Jio యాప్‌లకు ఫ్రీగా యాక్సస్ పొందవచ్చు. ఈ ప్లాన్ అర్హత ఉన్న సబ్స్క్రైబర్లకు అన్లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తుంది.
జియో రూ. 719 ప్లాన్ : ఈ ప్లాన్ కింద వినియోగదారులు 2GB రోజువారీ డేటా లిమిట్, 5G యాక్సెస్‌తో అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, Jio యాప్‌లు, 168GB మొత్తం డేటాను పొందవచ్చు.
జియో రూ. 1199 ప్లాన్ : ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ జియో 5G ఆఫర్లో కూడా పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ. 455 ప్లాన్ : ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్లిమిటెడ్ కాలింగ్, 6GB మొత్తం డేటా, 900 SMS, అపోలో సర్కిల్, FASTag క్యాష్‌బ్యాక్, Hellotunes, Wynk అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ. 719 ప్లాన్ : ఈ ప్లాన్ రోజువారీ 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Airtel యాప్, వెబ్ నుంచి రీఛార్జ్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్‌కి 3 నెలల ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. అయితే, మీరు ఎయిర్టెల్ 5G కవరేజ్ ఏరియాలో నివసిస్తుంటే.. మీరు రోజువారీ క్యాప్ లేకుండా అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ని పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ. 839 ప్లాన్ : ఈ ప్లాన్ ఎయిర్టెల్ 5G-రెడీ నగరాల్లోని వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ను కూడా అందిస్తుంది. మిగిలిన వినియోగదారులకు ఈ ప్లాన్ రోజువారీ 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఫ్రీగా సభ్యత్వం వంటి అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
ఎయిర్టెల్ రూ. 999 ప్లాన్ : ఎయిర్టెల్ యూజర్లు తమ డేటా క్యాప్ లేకుండా 5G-రెడీ ఫోన్లలో అన్లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించవచ్చు. ఇతర యూజర్ల కోసం, Airtel రోజువారీ 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)కి ఉచిత సభ్యత్వంతో పాటు మరిన్ని డేటా బెనిఫిట్స్ అందిస్తుంది.
Vi రూ. 719 ప్లాన్ : ఈ ప్లాన్ రోజువారీ 1.5GB డేటా, రోజుకు 100 SMS, అన్లిమిటెడ్ కాలింగ్, అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.
Vi రూ. 839 ప్లాన్ : ఈ ప్యాక్ కింద, Vi రోజువారీ 2GB డేటా, రోజుకు 100 SMSలు, వారాంతపు డేటా రోల్ఓవర్, నైట్ బింగే, మరిన్ని అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.
Vi రూ. 1066 ప్లాన్ : ఈ ప్యాక్ 2GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Vi వంటి అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.