Salaar : ‘సలార్’ జపాన్ రిలీజ్ ట్రైలర్ చూశారా? జపాన్ లో సలార్ రిలీజ్ ఎప్పుడంటే..

ఇప్పుడు సలార్ సినిమాని కూడా జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. అసలే జపాన్ లో ప్రభాస్ అభిమానులు భారీగానే ఉన్నారు.

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా పృద్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీసింహా, శ్రియారెడ్డి, శృతిహాసన్, ఈశ్వరి రావు.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన సలార్(Salaar) సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజయిన సలార్ సినిమా భారీ హిట్ కొట్టి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత సలార్ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అయి అక్కడ కూడా హిట్ అయింది.

ఇక సలార్ సినిమాకి పార్ట్ 2 కూడా ఉందని ప్రకటించడం, పార్ట్ 1 చివర్లో క్లైమాక్స్ అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో సలార్ 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జపాన్ లో మన తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. మన తెలుగు హీరోలకు అక్కడ కూడా అభిమానులు ఉన్నారు. బాహుబలి, సాహో, RRR.. ఇలా చాల సినిమాలు జపాన్ లో పెద్ద హిట్ అయ్యాయి.

Also Read : Trisha : 40 ఏళ్ళ వయసులో అందాన్ని మెయింటైన్ చేస్తూ.. అరడజను సినిమాలతో దూసుకుపోతున్న త్రిష..

ఇప్పుడు సలార్ సినిమాని కూడా జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. అసలే జపాన్ లో ప్రభాస్ అభిమానులు భారీగానే ఉన్నారు. ప్రభాస్ పేరుతో అక్కడ సెలబ్రేషన్స్ చేయడం, షాప్స్ కి పేర్లు పెట్టడం, ప్రభాస్ బొమ్మలు సేల్ చేయడం గతంలో చూసాం. ఇప్పుడు సలార్ సినిమా జపనీస్ భాషలో రిలీజ్ చేస్తుండటంతో అక్కడి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జపాన్ లో సలార్ సినిమాని జులై 5న రిలీజ్ చేస్తున్నారు. మరి గత సినిమాల్లాగే సలార్ కూడా జపాన్ లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుందా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు