Trisha : 40 ఏళ్ళ వయసులో అందాన్ని మెయింటైన్ చేస్తూ.. అరడజను సినిమాలతో దూసుకుపోతున్న త్రిష..
నేడు మే 4 త్రిష పుట్టినరోజు. 40 ఏళ్ళు పూర్తిచేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.

Trisha Krishnan getting Huge Movie Offers in her Second Innings
Trisha : త్రిష.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలని వరుస సినిమాలతో ఏలింది. ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరితో త్రిష నటించింది. తన సినిమాలతో, నటనతో, అందంతో ప్రేక్షకులని మెప్పించి ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. నేడు మే 4 త్రిష పుట్టినరోజు. 40 ఏళ్ళు పూర్తిచేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన త్రిష హీరోయిన్ గా మారి వరుస సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. తెలుగు, తమిళ్ లో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే ఒకానొక సమయంలో తమిళ్ కే పరిమితమై అడపాదడపా సినిమాలు చేసిన త్రిష 96 సినిమాతో ఒక్కసారిగా తన స్టార్ డమ్ అందరికి గుర్తుచేసింది. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాగే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 40 ఏళ్ళు దాటినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అలరిస్తుంది.
Also Read : Arjun YK : ‘ప్రసన్న వదనం’ సినిమాతో హిట్ కొట్టిన మరో సుకుమార్ శిష్యుడు..
ఇప్పుడు త్రిష చేతిలో దాదాపు అరడజను సినిమాలు, అది కూడా స్టార్ హీరోల సరసన ఉన్నాయి అంటే త్రిష ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో చెప్పొచ్చు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు అందరు స్టార్ హీరోలతో చేసిన త్రిష.. ఇప్పుడు సీనియర్ హీరోలందరికీ ఆప్షన్ గా మారింది. ప్రస్తుతం త్రిష చిరంజీవి సరసన విశ్వంభర, అజిత్ సరసన విడాముయర్చి, కమల్ హాసన్ సరసన థగ్ లైఫ్, మోహన్ లాల్ సరసన రామ్, టోవినో థామస్ సరసన ఐడెంటిటీ, ఫిమేల్ ఓరియెంటెడ్ బృంద సిరీస్ చేస్తుంది. ఇవే కాక త్రిషకి ఇంకా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. 40 ఏళ్ళ వయసులో అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ, వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది త్రిష. కెరీర్లో ఆల్రెడీ సక్సెస్ అయిన త్రిష 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.