Arjun YK : ‘ప్రసన్న వదనం’ సినిమాతో హిట్ కొట్టిన మరో సుకుమార్ శిష్యుడు..
ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన సుహాస్ ప్రసన్న వదనం సినిమాతో మరో హిట్ కొట్టాడు.

Sukumar Student Arjun YK gets Hit Talk for his First Movie Suhas Prasanna Vadanam
Arjun YK Prasanna Vadanam : సుహాస్ హీరోగా నిన్న మే 3న రిలీజయిన సినిమా ప్రసన్న వదనం. అర్జున్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా, రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న.. ముఖ్య పాత్రల్లో జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో ఈ ప్రసన్న వదనం సినిమా తెరకెక్కింది. మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.
సాధారణంగా సుహాస్ సినిమాలంటేనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులని మెప్పిస్తాయి అని అందరూ ఫిక్స్ అయ్యారు. దీంతో సుహాస్ సినిమా వస్తుందంటే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్, మంచి సినిమా అయి ఉంటుందని ముందే భావిస్తున్నారు. ప్రసన్న వదనం సినిమా కూడా ఫేస్ బ్లైండ్ నెస్ అనే కొత్త కాన్సెప్ట్ తో మర్డర్ మిస్టర్ థ్రిల్లర్ గా వచ్చింది. సుకుమార్ దగ్గర ఆల్మోస్ట్ జగడం సినిమా నుంచి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న అర్జున్ వైకె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ప్రసన్న వదనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సుకుమార్ వచ్చి మరీ అర్జున్ ని ఆకాశానికెత్తేశారు. అర్జున్ గురించి గొప్పగా చెప్పి అతని వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అన్నారు. ప్రసన్న వదనం సినిమా ఆల్రెడీ చూశాను, అదిరిపోయింది అని చెప్పారు. సుకుమార్ స్వయంగా సినిమా బాగుంది అని చెప్పడంతో ప్రసన్న వదనంపై ఇంకా అంచనాలు పెంచాయి. దీంతో ప్రసన్న వదనం సినిమాకి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి మరీ చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లిందని, అందరికి బాగా నచ్చి ఈ సినిమాని కొనేశారని నిర్మాత తెలిపారు.
Also Read : NTR Birthday : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. బర్త్ డేకి ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్.. మరి దేవర?
సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ అంటే ఆ సినిమాకి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. కుమారి 21F తో పల్నాటి సూర్య ప్రతాప్, ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సాన, విరూపాక్ష తో కార్తీక్ దండు, దసరాతో శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు ప్రసన్న వదనంతో అర్జున్.. ఇలా సుకుమార్ శిష్యులు అంతా హిట్స్ ఇచ్చారు. ఇంకా సుకుమార్ నుంచి శిష్యులు చాలా మంది వస్తున్నారు. సుకుమార్ శిష్యులు అంటే నిర్మాతలు కూడా డబ్బులు పెట్టడానికి రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది.
View this post on Instagram
ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన సుహాస్ ప్రసన్న వదనం సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇదే కంటిన్యూ చేస్తూ రెండో హ్యాట్రిక్ కూడా కొడతాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ మర్డర్ మిస్టరీని థియేటర్లో చూడండి. అస్సలు మిస్ అవ్వొద్దు ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సినిమాని.
ఇక ప్రసన్న వదనం కథ విషయానికొస్తే.. సూర్య(సుహాస్)కి ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల ఎవరి మొహాలను గుర్తుపట్టలేడు. వాయిస్ లు కూడా గుర్తుపట్టలేడు. తన సమస్య ఎవరికీ తెలియకుండా ఆర్జేగా పనిచేస్తూ మెయింటైన్ చేస్తూ వస్తాడు. తన జీవితంలోకి అనుకోకుండా ఆద్య(పాయల్) రాగా ముందు ఫ్రెండ్స్ అయి తర్వాత ప్రేమలో పడతారు. ఓ రోజు తెల్లవారుజామున ఓ వ్యక్తి ఓ అమ్మాయి(సాయి శ్వేత)ని లారీ కిందకి తోసి మర్డర్ చేయడం చూస్తాడు. కానీ తన ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల అది ఎవరు చేసారో తెలీదు. అది యాక్సిడెంట్ అని వార్తల్లో చూసిన సూర్య పోలీసులకు ఫోన్ చేసి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. అనూహ్యంగా అదే మర్డర్ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. అసలు మర్డర్ అయిన అమ్మాయి ఎవరు? ఎందుకు చంపారు? పోలీసులు ఏం చేసారు? ఈ మర్డర్ వల్ల సుహాస్ కి ఎదురైన ఇబ్బందులు ఏంటి? సుహాస్ ని మర్డర్ కేసులో ఎవరు ఇరికించారు? సుహాస్ కి తనకున్న ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన సమస్యలేంటి? తన ప్రేమ సంగతేంటి? తెలియాలంటే మీరు థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.