NTR Birthday : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. బర్త్ డే‌కి ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్.. మరి దేవర?

ఎన్టీఆర్ బర్త్ డేకి తన సినిమాల నుంచి అప్డేట్స్ ఏమైనా ఇస్తారేమో అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

NTR Birthday : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. బర్త్ డే‌కి ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్.. మరి దేవర?

NTR Prashanth Neel Movie Update on NTR Birthday Fans Waiting

Updated On : May 4, 2024 / 12:23 PM IST

NTR Birthday : ఇటీవల ఎన్టీఆర్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క దేవర షూటింగ్, మరో వైపు వార్ 2 షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలతో హంగామా చేస్తున్నారు. దీంతో ఇటీవల రెగ్యులర్ గా ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు బయటకి వస్తుండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. త్వరలో మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తుండటంతో ఫ్యాన్స్ ఇప్పట్నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టేసారు.

ఎన్టీఆర్ బర్త్ డేకి తన సినిమాల నుంచి అప్డేట్స్ ఏమైనా ఇస్తారేమో అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దేవర(Devara) సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ కావాలని ఫ్యాన్స్ ఇప్పటికే అడుగుతున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో కొరటాల శివ వస్తే ఎన్టీఆర్ బర్త్ డేకి అప్డేట్ కావడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేసారు. వార్ 2 సినిమా నుంచి కనీసం పోస్టర్ అయిన రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నారు.

Also Read : Double Ismart : డబల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూట్ మొదలు.. పూజ చేసిన పూరి జగన్నాద్, ఛార్మి..

అయితే తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కొత్త సినిమా అప్డేట్ వస్తుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో NTR 31వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ చేతిలో సలార్ 2, ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ సినిమా అప్డేట్ కానీ, సినిమా ఓపెనింగ్ కార్యక్రమం కానీ నిర్వహిస్తారని సమాచారం. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.