Postal Ballot Voting: విజయవాడలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా పోస్టల్ బ్యాలెట్ల వద్దకు ఉద్యోగులు క్యూ కట్టారు.

మరోవైపు, నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేశారో లేదో అని చెక్ చేసుకుంటున్నారు రాజకీయ పార్టీల ఏజెంట్లు. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 21 వేల పోస్టల్ బ్యాలెట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు నుంచి మూడు రోజులపాటు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుంది.

బయటి జిల్లాలో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సెంట్రల్ లైజ్ స్టేషన్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. అలాగే, ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ పై ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంఘాల నేతలు అంటున్నారు. కాగా, ఏపీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి.

 Also Read: రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారు: అసదుద్దీన్ కీలక కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు