రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారు: అసదుద్దీన్ కీలక కామెంట్స్

Asaduddin Owaisi: రిజర్వేషన్లను తొలగించాలన్నదే బీజేపీ లక్ష్యమని అసదుద్దీన్ తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకే..

రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారు: అసదుద్దీన్ కీలక కామెంట్స్

Asaduddin Owaisi

Updated On : May 4, 2024 / 7:23 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఐదేళ్ల పాటు ఎలాంటి డోకా లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాను ప్రజల మధ్యనే ఈ విషయం రేవంత్ రెడ్డికి చెప్పానని తెలిపారు. అభివృద్ధి, మతపర శాంతి కోసం రేవంత్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.

రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. మతపర గొడవలు సృష్టించాలన్నదే మాధవీలత అజెండా అని ఆరోపించారు.

రిజర్వేషన్లను తొలగించాలన్నదే బీజేపీ లక్ష్యమని అసదుద్దీన్ తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు సాధించాలనుకుంటోందని చెప్పారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో పతంగీ ఎగురుతుందని, బీజేపీ ఖతం అవుతుందని అన్నారు. తమ పార్టీ కోసం నల్గొండ గద్దర్ మంచి పాట ఇచ్చారని చెప్పారు. పనితీరును చూసి, గద్దర్ మంచి లిరిక్స్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ, ఏపీలో పార్టీ ప్రచారం కోసం ఈ పాట ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

Also Read: కేటీఆర్.. కారు కరాబైంది ఇక రాదు.. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది : సీఎం రేవంత్ రెడ్డి