కేటీఆర్.. కారు కరాబైంది ఇక రాదు.. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది : సీఎం రేవంత్ రెడ్డి

నామా నాగేశ్వరరావును బక్రా చేయడానికి కేసీఆర్ ఖమ్మం బరిలో నిలిపాడు. నామాకు నేను సూచన చేస్తున్న.. కేసీఆర్ మాటలు వినకు.

కేటీఆర్.. కారు కరాబైంది ఇక రాదు.. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revnath Reddy : కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు ఖాయం. మొదటి ఎన్నికల్లో అత్యధిక మొజార్టీ రావి నారాయణరెడ్డికి వచ్చింది… ఆ తరువాత రఘురాం రెడ్డికి వచ్చే మొజార్టీ చరిత్రలో నిలవబోతుందని రేవం
త్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాకు గొప్ప పోరాట చరిత్ర ఉంది. 1969 తెలంగాణ ఉద్యమం పాల్వంచ నుంచి ప్రారంభమైంది. నిశితంగా గమనిస్తున్నా.. ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో మిమ్మల్నిచూసి నేర్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి మూడు పర్యాయాలు ఒక్క సీటు ఇచ్చారు. నక్క జిత్తుల, నయవంచన కేసీఆర్ ను వంద అడుగుల గోతి తీసి బొందపెట్టారని రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలకు నేను దూరంగా ఉంటా. ఢిల్లీ పెద్దలు 22 జిల్లాలకు సీఎంవు నువ్వు.. ఖమ్మం జిల్లాలో ప్రతిఒక్కరూ సీఎంలే అని చెప్పారు. అందుకే ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు దిక్సూచీగా ఉందని రేవంత్ అన్నారు.

Also Read : కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్ కీలకంగా మారుతోంది : హరీశ్ రావు

నామా నాగేశ్వరరావును బక్రా చేయడానికి కేసీఆర్ ఖమ్మం బరిలో నిలిపాడు. నామాకు నేను సూచన చేస్తున్న.. కేసీఆర్ మాటలు వినకు. ఆ కుటుంబం మాటలకు ఎవరూ పోటీ పడరని సీఎం రేవంత్ అన్నారు. మళ్లీ సీఎం అయ్యేది కేసీఆర్ అని కేటీఆర్ అంటుండు.. కేటీఆర్ కారు చెడిపోయి కార్జానాకు పోలేదు. కారు కరాబైంది ఇక రాదు. డిసెంబర్ 3న ఫలితాలు సెమీ ఫైనల్స్. ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్స్. గుజరాత్ టీంను ఇంటికి పంపించాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు పదేళ్లు బీజేపీ ఏం చేసింది.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది. కేసీఆర్.. 7లక్షల కోట్లు అప్పుపెట్టి దిగిపోయావు. భట్టి విక్రమార్క గట్టోడు కాబట్టి ప్రతినెల జీతాలు ఇస్తున్నారని రేవంత్ అన్నారు. రైతు భరోసా 7లక్షల 60వేల మందికి వేశాం. మిగిలిన 4లక్షల మందికి వేస్తామనిచెప్పారు. కేసీఆర్ వస్తావా? నువ్వు అమర వీరుల స్తూపం వద్దకు వస్తావా.. ఏ రైతుకు అయిన ఈనెల 9లోపు బాకీ ఉంటే నా ముక్కు నేలకు రాస్తా.. నువ్వు రాస్తావా అంటూ రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కు సిగ్గులేదు.. ముక్కు పెద్దగా ఉంది రాసిన రాస్తాడంటూ ఎద్దేవా చేశారు. ఆగస్టు 15లోపు భద్రాద్రి రామయ్య సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా.. మరో ఇద్దరు కూడా..

తుమ్మల గెలిస్తే సేవ చేస్తాడు. లేదంటే వ్యవసాయం చేస్తాడు. ఆయన కంటే వ్యవసాయం తెలుసా కేసీఆర్ నీకు అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం మారుస్తారు. బీజేపీకి ఓటువేస్తే రిజర్వేషన్లు పోతాయి. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని రేవంత్ అన్నారు. బీజేపీ ఏమి ఇచ్చింది గాడిద గుడ్డు.. మోదీ ఏం ఇచ్చాడు గాడిద గుడ్డు అంటూ కార్యకర్తలతో రేవంత్ చెప్పించారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.