కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్ కీలకంగా మారుతోంది : హరీశ్ రావు

కాంగ్రెస్ పేపర్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. శిక్ష పడాలా? వద్దా? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్ కీలకంగా మారుతోంది : హరీశ్ రావు

Harish Rao

BRS Leader Harish Rao : కాంగ్రెస్ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడికోసం రైతులకు సమయానికి నిధులు వచ్చేవి. కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు అందలేదు. నీటి ట్యాంకులు కనిపిస్తున్నాయి. విద్యుత్ అందక కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ వైద్యం సకాలంలో అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా.. మరో ఇద్దరు కూడా..

కాంగ్రెస్ హయాంలో కొత్త పథకాలు రాలేదు.. ఉన్న వాటిలో కోతలు మొదలయ్యాయని హరీశ్ రావు అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు అమలయ్యాయా? గృహ జ్యోతి పాక్షికంగా అమలవుతోంది. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. పేదలకు ఇచ్చే పెన్షన్లు ఒక నెల సర్కార్ ఇవ్వలేదు. 4వేల నిరుద్యోగ భృతి ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి వద్దురో నాయన ఈ పాలన అనే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుందని హరీశ్ అన్నారు.

Also Read : నరేంద్ర మోదీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ఓడిపోతుంది: కోదండరాం

కాంగ్రెస్ పేపర్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. శిక్ష పడాలా? వద్దా? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలి. అప్పుడు ప్రామిసరీ నోట్లు ఇచ్చారు. ఇప్పుడు గాడ్ ప్రామిస్ లను చేస్తున్నారని కాంగ్రెస్ నేతల హామీలపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండని ఓ మంత్రి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హోదాను మరిచి మాట్లాడుతున్నాడు. సీఎం తీరు రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతినేలా ఉంది. మాజీ సీఎం వయసును కూడా రేవంత్ గౌరవించడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకంగా రేవంత్ నిర్ణయం తీసుకుంటున్నారు. పగ, ప్రతీకారంతోనే పాలన జరుగుతుందని హరీశ్ రావు విమర్శించారు.

Also Read : రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ ప్రధాని కావాలి- సీఎం రేవంత్

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. బీఆర్ఎస్ కీలకంగా మారబోతుందని హరీశ్ రావు జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. ప్రాంతీయ పార్టీ నేతకే ప్రధాని పదవి దక్కుతుందని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ భాష వ్యంగ్యంగా ఉండేది. రేవంత్ రెడ్డి లాంటి భాష ఎవరూ వాడలేదని హరీశ్ అన్నారు. రిజర్వేషన్ల పై రెండు జాతీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ బద్దంగా సాధ్యం కానేకాదు. రిజర్వేషన్లను పెంచుకునేందుకు అవకాశం రాష్ట్రాలకు ఉండాలని మేం తీర్మానం చేశాం. ఒకరి ఆస్తులు మరొకరికి పంచడం ఎలా సాధ్యం అని హరీశ్ ప్రశ్నించారు. మీ పాలన గురించి చెప్పుకునే ధైర్యం లేకనే ఇలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.