Kaikala Satyanarayana : సీనియర్ ఎన్టీఆర్‌ కోసం ఎన్నో సాహసాలు చేసిన కైకాల..

హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఎటువంటి పాత్ర అయినా అలవోకగా చేసి నవరసనటసార్వబౌవంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు 'కైకాల సత్యనారాయణ'. గత కొంత కాలంగా అయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థకు గురు కావడంతో కైకాల కన్ను మూశారు. మరిన్ని వివరాలు మరి కాసేపటిలో కుటుంబసభ్యులు తెలియజేయనున్నారు.

Kaikala Satyanarayana : హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఎటువంటి పాత్ర అయినా అలవోకగా చేసి నవరస నటనా సార్వభౌమగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘కైకాల సత్యనారాయణ’. గత కొంత కాలంగా అయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కైకాల కన్ను మూశారు. మరిన్ని వివరాలు మరి కాసేపటిలో కుటుంబసభ్యులు తెలియజేయనున్నారు.

Kaikala Satyanarayana : నటుడు కైకాల సత్యనారాయణ కనుమూత..

కాగా కైకాల సత్యనారాయణ.. జానపదం, పౌరాణికం, చరిత్రాత్మకం, సాంఘికం వంటి అన్ని జోనర్లో సినిమాల్లో నటించాడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎస్వీ రంగారావు గారి తరువాత అంతటి పేరుని సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. ‘సిపాయి కూతురు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కైకాల, సీనియర్ ఎన్టీఆర్ కి డూప్‌‌గా ఎన్నో సినిమాలు చేశాడు. కైకాల శరీర ఆహార్యం ఎన్టీఆర్ కి దగ్గరగా ఉండడంతో ఎన్టీఆర్ నటించలేని సన్నివేశాలన్నీ కైకాల నటించేవాడు.

అలా సాహస సన్నివేశాలు సమయంలో కూడా ఎన్టీఆర్ కోసం కైకాల ధైర్యంగా ముందుకు వచ్చి, అయనకి డూప్ గా నటించేవాడు. అయితే తన కోసం ఇంత కష్టపడుతున్న కైకాలని చూసి ఎన్టీఆర్.. ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలో నటుడిగా అవకాశాన్ని ఇచ్చాడు ఎన్టీఆర్. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ కథానాయకుడి పాత్రలో ఉంటే కైకాల సత్యనారాయణ ప్రతినాయకుడి పాత్రల్లో ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కలిసి దాదాపు 100 పైగా సినిమాల్లో నటించాడు.

ట్రెండింగ్ వార్తలు