Kangana Ranaut : ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు.. కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు అవుతుండటంతో కంగనా రనౌత్ తన ఎమర్జెన్సీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.

Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మండీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కంగనా మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. వాటిలో ‘ఎమర్జెన్సీ’ ఒకటి. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ‘ఎమర్జెన్సీ’ నేపథ్యంతో కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాని తెరకెక్కించింది.

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీ పాత్ర పోషించడమే కాక ఈ సినిమాని తనే డైరెక్ట్ చేసింది. అయితే ఇప్పటికే ఈ సినిమా పూర్తయింది. ఎప్పుడో విడుదల కావాల్సినా ఎన్నికల వల్ల వాయిదా పడింది. తాజాగా నేటికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్ళు పూర్తయి 50వ సంవత్సరం మొదలవడంతో కంగనా రనౌత్ తన ఎమర్జెన్సీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.

Also Read : Pawan Kalyan : రాజకీయాల్లో పవన్ కొత్త ప్రయోగం.. మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు..

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాను 2024 సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో జరిగిన సంఘటనల గురించి చూపించబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు