Aadi Sai Kumar Shanmukha movie shooting finish
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు యువ హీరో ఆది సాయికుమార్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం షణ్ముఖ. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు షణ్ముగం సాప్పని దర్శకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తుండగా సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ పై సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు షణ్ముగం సాప్పని తెలియజేశాడు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందిన డివోషనల్ థ్రిల్లర్ ఇది అని అన్నాడు. విజువల్ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు చెప్పాడు. హైదరాబాద్‌లో ఓ ఖరీదైన సెట్‌ను వేసి చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు.
Buddy trailer : అల్లు శిరీష్ ‘బడ్డీ’ ట్రైలర్.. అన్యాయంపై తిరగబడ్డ టెడ్డీబేర్‌ను చూశారా..?
కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందించినట్లు చెప్పారు. అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలు కానున్నాయన్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.
VD14 : ఈ తూరి సినిమా అంతా మన సీమలోనే.. రాయలసీమ వాళ్లకు విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్..