Kalki Ticket Prices : వామ్మో అక్కడ కల్కి టికెట్ ధర అంతా.. వేలల్లో టికెట్ ధరలు.. జోరుగా కల్కి టికెట్స్ అమ్మకాలు..

టికెట్ రేట్లు కల్కి సినిమాకు భారీగానే ఉన్నాయి.

Prabhas Kalki 2898 AD Movie Ticket Prices all Over India Full Details Here

Kalki Ticket Prices : ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి. అయితే టికెట్ రేట్లు కల్కి సినిమాకు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ రావడంతో అన్ని థియేటర్స్ లో టికెట్ రేట్లు పెరిగాయి.

కల్కి సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం మల్టీప్లెక్స్ లలో చూడాలంటే కనీసం 500 ఒక్క టికెట్ కి ఖర్చుపెట్టాల్సిందే. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 200 నుంచి 300 వరకు పెట్టాల్సిందే ఒక్క టికెట్ కి. ఇక ఫ్యామిలీ అంతా కల్కి సినిమాకు వెల్దామనుకుంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిందే. అయితే సాధారణంగానే ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, పూణే లాంటి మహా నగరాల్లో మల్టీప్లెక్స్ లలో రిలీజ్ రోజు టికెట్ ధరలు వేలల్లో ఉంటాయి.

Also Read : Pushpa 2 : ‘పుష్ప 2’ తప్పుకోవడంతో.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు లైన్లోకి వచ్చిన ఎన్టీఆర్ బామ్మర్ది, రానా..

తాజా సమాచారం ప్రకారం ముంబైలో రిలీజ్ రోజు మల్టీప్లెక్స్ లలో కల్కి సినిమా ఒక్కో టికెట్ ధర 2000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తుంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్ లో అయితే 3000 రూపాయల వరకు ఉందట. ఢిల్లీ మల్టీప్లెక్స్ లో 1300 నుంచి 2000 వరకు కల్కి టికెట్ రేట్లు ఉన్నాయి. ఇక బెంగళూరులో రిలీజ్ రోజు కల్కి టికెట్స్ మల్టీప్లెక్స్ లలో 1100 నుంచి 1500 వరకు ఉన్నాయని సమాచారం. ఇక మన హైదరాబాద్ లో అయితే బెనిఫిట్ షోకి కొంతమంది 3000 రూపాయలకు కల్కి టికెట్స్ బ్లాక్ లో అమ్ముతున్నారని కూడా టాక్.

టికెట్ రేటు ఎంతున్నా ప్రభాస్ మీద అభిమానంతో, కల్కి మీద ఉన్న అంచనాలతో అభిమానులు, ప్రేక్షకులు ఆన్లైన్ లో కల్కి టికెట్లు తెగ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓపెన్ చేసిన అన్ని థియేటర్స్ రిలీజ్ రోజు బుకింగ్స్ అయిపోయాయి. ఇక అమెరికాలో అయితే రిలీజ్ కి ముందే 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది కల్కి. దీంతో కల్కి సినిమా కలెక్షన్స్ భారీగానే వస్తాయని తెలుస్తుంది.