‘Maa’ Elections : హేమ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కరాటే కళ్యాణి

కరాటే కళ్యాణి హేమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.. హేమ తెగ రెచ్చిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘Maa’ Elections : మా ఎన్నికల వివాదం రచ్చకెక్కింది. సినీ నటుడు నరేష్, నటి కరాటే కళ్యాణిపై హేమ మాధాపూర్ పోలీసులకు పిర్యాదు చేసింది. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇదే సమయంలో కరాటే కళ్యాణి హేమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.. హేమ తెగ రెచ్చిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హేమ గెలవాలని ప్రచారం చేసుకోకుండా తనను ఓడించాలని ప్రచారం చేస్తున్నట్లు కరాటే కళ్యాణి మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలని పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు కళ్యాణి.

Read More : MAA Elections: ‘మా’కు తెలుగువాడు పనికిరాడా.. ఆలోచించండి!

హేమ ఎక్కువ మాట్లాడితే తన దగ్గర ఉన్న ఫ్రూప్స్ అన్ని బయటపెడతానన్నారు. సినీ పరిశ్రమలోని మహిళ సెక్యూరిటీ గురించి అంతలా ఆలోచిస్తున్న హేమ.. ‘మా’ వాట్సాప్ గ్రూప్ లో కురస బట్టలు వేసుకున్న యువతి ఫోటోలు పెట్టి ఎందుకు డిలీట్ చేసిందని ప్రశ్నించారు. తన దగ్గర అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయని తెలిపారమే. ఎదుటువారిని విమర్శించడం మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని హేమను ఉద్దేశిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

Read More : Maa Election: నా ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు..! నరేష్, కళ్యాణిలపై నటి హేమ ఫిర్యాదు

గతంలో నరేష్, శివాజీ రాజా హేమను సైబర్ క్రైం పోలీసుల వద్దకు తీసుకెళ్లింది నిజం కాదా?.. ఆ రోజు నువ్వు సోషల్ మీడియాలో పోస్టు చేసిన అశ్లీల ఫోటోలను డిలీట్ చేయమని పోలీసులు నీకు చెప్పలేదా అంటూ ప్రశ్నించారు కళ్యాణి. అనవసరమైన విమర్శలు చేస్తూ ‘మా’ ప్రతిష్టను దిగజార్చవద్దని ఆమె కోరారు. హేమ ఇతరుల ఓటమిపై కాకుండా తన గెలుపుపై దృష్టిపెడితే మంచిదని కళ్యాణి హితవు పలికారు.

Read More : MAA Elections : ఇండస్ర్టీని విడగొట్టాలని చూస్తే ఊరుకోను : మంచు విష్ణు

ఇక నరేష్ కూడా హేమపై విమర్శలు గుప్పించారు. మా ఎన్నికల్లో గెలిచేందుకు హేమ అబద్ధాన్నే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుందని.. అవి మానుకోవాలని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా హేమపై దాడి జరిగిన సమయంలో తాను, శివాజీ రాజా సైబర్ క్రైం పోలీసుల దగ్గరికి తీసుకెళ్లామని, అక్కడ హేమ వారితో గొడవపడిందని తెలిపారు. తాము పోలీసులతో మాట్లాడి కేసు ఫెయిల్ చేయించామని చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు