Keerthi Suresh : ‘గాంధారి’గా కీర్తి సురేష్.. రేపే విడుదల..

తాజాగా కీర్తి ‘గాంధారి’ అనే ఒక మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌లో నటించింది. దీ రూట్‌, సోనీ మ్యూజిక్‌ సౌత్‌ సంస్థలు కలిసి గాంధారి అనే మ్యూజిక్ ఆల్బమ్ ని నిర్మించాయి. ఇందులో 'గాంధారి'......

Keerthi Suresh :   ‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది కీర్తి సురేష్. ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. అంతే కాక ఎవరు చేయని డేర్ కూడా చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయరు. కానీ కీర్తి సురేష్ ఒకపక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క స్టార్ హీరోలకి చెల్లి పాత్రలు కూడా చేస్తుంది. ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉంది కీర్తి సురేష్.

 

తాజాగా కీర్తి ‘గాంధారి’ అనే ఒక మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌లో నటించింది. దీ రూట్‌, సోనీ మ్యూజిక్‌ సౌత్‌ సంస్థలు కలిసి గాంధారి అనే మ్యూజిక్ ఆల్బమ్ ని నిర్మించాయి. ఇందులో ‘గాంధారి’ టైటిల్ క్యారెక్టర్ లో కీర్తి సురేష్ డ్యాన్స్ వేసింది. ఈ ‘గాంధారి’ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘గాంధారి’ మ్యూజిక్‌ ఆల్బమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

Mahesh Babu : కళావతి స్టెప్పులతో మహేష్ ని దించేసిన సితార..

ఈ పోస్టర్ లో కీర్తి చేతికి గోరింటాకుతో, సంప్రదాయ దుస్తుల్లో డ్యాన్స్ చేస్తూ ఉన్న స్టైల్ లో ఉంది. ‘లవ్‌స్టోరీ’ సినిమా సంగీత దర్శకుడు పవన్‌ దీనికి సంగీతం అందించారు. బృందా మాస్టర్‌ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.

ట్రెండింగ్ వార్తలు