Lata Mangeshkar : స్కూలుకే వెళ్లని లతా మంగేష్కర్.. ఎన్ని భాషలు వచ్చో తెలుసా?

లతా మంగేష్కర్ కి మొదట్లో చదవడం, రాయడం అంతగా రాదు. ఆ తర్వాత ఆమె ఇంట్లో పనిమనిషి వద్ద మరాఠీ అక్షరాలు చదవడం, రాయడం నేర్చుకుంది లతాజీ. అయితే తన బంధువు ఒక అమ్మాయి.......

Lata Mangeshkar :   గాన కోకిల, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణం భారత సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు. ఆమె మరణంతో అందరూ ఆమె లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.

చిన్నప్పుడు లతాజీ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో ఇంట్లో పెద్ద అమ్మాయి కావడంతో ఇంటి భారం అంతా తానే మోయాల్సి వచ్చింది. స్కూలుకి వెళ్ళేటప్పుడు తన పదినెలల చెల్లిని కూడా తీసుకెళ్లడంతో ఓ టీచర్ ఇలా తీసుకురావొద్దని హెచ్చరించింది. దీంతో ఎప్పటికి స్కూల్ కి వెళ్ళను అని ఫిక్స్ అయింది. అప్పట్నుంచి చదువు కూడా మానేసింది లతా మంగేష్కర్.

Lata Mangeshkar : లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారో తెలుసా??

లతా మంగేష్కర్ కి మొదట్లో చదవడం, రాయడం అంతగా రాదు. ఆ తర్వాత ఆమె ఇంట్లో పనిమనిషి వద్ద మరాఠీ అక్షరాలు చదవడం, రాయడం నేర్చుకుంది లతాజీ. అయితే చిన్నప్పుడు తన బంధువు ఒక అమ్మాయి మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్తుంటే తాను కూడా అప్పుడప్పుడు వెళ్లడంతో తనకి పాటలపై ఇంట్రెస్ట్ పెరిగింది. అలా మెల్లిగా పాటల వైపుకు తన ప్రయాణం మారింది.

Lata Mangeshkar : ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు

లత మంగేష్కర్ కి మరాఠి, హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ మాట్లాడటం వచ్చు. సంస్కృతం, తమిళ్ అర్ధం చేసుకోగలదు. స్కూలుకే వెళ్లకుండా ఇన్ని భాషలు రావడం అంటే మాములు విషయం కాదు. లతాజీ అలా స్కూలుకే వెళ్లకుండా, చదువుకోకుండా తన ట్యాలెంట్ తన స్వశక్తితో భారతరత్న వరకు ఎదగడం.. ఆమె జీవితం అందరికి ఆదర్శప్రాయం.

ట్రెండింగ్ వార్తలు